Tollywood Heroins Remunartions: టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..

Thu, 18 Apr 2024-7:20 am,

టాలీవుడ్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ కథానాయికలకు ఏ మాత్రం తక్కువ కాకుండా పారితోషకం తీసుకుంటున్నారు. మన దక్షణాది భామలే ఉత్తరాదిని ఏలుతున్నారు. అసలు తెలుగులో ఏ హీరోయిన్ ఎంతెంత పారితోషకం తీసుకుంటున్నారో ఓ లుక్కేద్దాం..

రష్మిక మందన్న

పుష్ప , యానిమల్  సినిమాలతో రష్మిక మందన్న క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల పారితోషకం తీసుకుంటున్న ఈమె పుష్ప 2 హిట్టైయితే.. మరో రూ. కోటి పెంచడం ఖాయమనే చెప్పాలి.

పూజా హెగ్డే.. రాధే శ్యామ్ ముందు వరకు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డే.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా ఈమె కెరీర్ డౌన్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషకం అందుకుంటోంది.

 

శ్రీలీల.. గుంటూరు కారం దెబ్బతో ఒక్కసారిగా శ్రీలీల కెరీర్‌లో కుదుపు మొదలైంది. ఇందులో ఈమె డాన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్‌' సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 1.50 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

కియారా అద్వానీ కియారా అద్వానీ ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం దాదాపు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

 

నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్ ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు పారితోషకం అందుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'హరి హర వీరమల్లు' సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది.

సాయి పల్లవి సాయి పల్లవి నిన్న మొన్నటి వరకు రూ. 1.5 కోటి పారితోషకం తీసుకుంటోంది. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో వస్తోన్న 'తండేల్' మూవీ కోసం రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది. అటు బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న రామాయణం సినిమా కోసం ఏకంగా రూ. 5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

కీర్తి సురేష్.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ దక్షిణాదిలో అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

రాశి ఖన్నా.. రాశి ఖన్నా.. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 60 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link