Tollywood Most Eligible Bachelors 1: ప్రభాస్, విజయ్, రామ్, శేష్ సహా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు వీళ్లే.. 2024లో వీళ్లు పెళ్లి పీఠలు ఎక్కుతారా.. ?
ప్రభాస్.. ప్రభాస్ వయసు 44 యేళ్లు దాటినా.. ఇప్పటికీ పెళ్లిపై ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో సల్మాన్ ఖాన్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మన రెబల్ స్టార్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ సై అంటే పెళ్లి చేసుకోవడానికి సై అనే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. మరి 2024లో అయిన తన బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేస్తాడా అని చూడాలి.
విజయ్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో ఇతను ఒకడు. ఇతని ఏజ్ 34 యేళ్లు. మరి 2024లో అయిన ఇతను ఓ ఇంటి వాడవుతాడా లేదా చూడాలి.
రామ్ పోతినేని..టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. గత రెండేళ్లుగా ఇతను పెళ్లి చేసుకోబోతున్నడంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. మరి ఈ ఇయర్ అయిన ఇతను పెళ్లి చేసుకుంటాడా అనేది వెయిట్ అండ్ సీ.
అడివి శేష్.. టాలీవుడ్‌లో ప్రభాస్ తర్వాత ఏజ్ 40కు దగ్గరవుతున్న ఇప్పటికీ సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నాడు అడివి శేష్. ఆల్రెడీ ఇతను ఒక పెద్దింటి అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి 2024లో అయిన పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.
సాయి దుర్గ తేజ్.. సోలో బ్రతకు సో బెటర్ అంటూ బ్యాచిలర్ సినిమాలు చేస్తోన్న సాయి దుర్గ తేజ్ వయసు 37 యేళ్లు. మరి ఈ ఇయర్ అయిన ఇతను మ్యారేజ్ చేసుకొని ఓ ఇంటివాడు అవుతాడా లేదా అనేది చూడాలి.
అక్కినేని అఖిల్..టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచిలర్‌గా ఉన్న అక్కినేని అఖిల్ త్వరలో 29వ యేట అడుగు పెట్టబోతున్నాడు. మరి 2024లో అయిన తన బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు వేస్తాడా లేదా అనేది చూడాలి.