Tollywood News: ఆ ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రే వైరల్.. యంగ్ హీరోని పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Sat, 09 Nov 2024-11:42 pm,

ఇంతకీ ఆ ఎవరా యంగ్ హీరో.. ఎవరా పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్.. అంతా ఒక్కసారిగా అయోమయంగా అనిపించింది కదా? తన మొదటి సినిమాలో హీరోగా పరిచయమైన అబ్బాయినే రహస్యంగా ప్రేమించింది. చివరికి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఎవరో అని అనుకోకండి.. ఆవిడే రహస్య గోరఖ్..  

రహస్య గోరఖ్ ఐదేళ్లుగా తన మొదటి సినిమాలో పరిచయమైన కిరణ్ అబ్బవరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. చివరగా ప్రేమ ఫలించి పెళ్లిరూపంగా మారింది.. ఈ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన వీరిద్దరూ ఒకటయ్యారు.. కర్ణాటకలోని ప్రముఖ నగరంలో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.

కిరణ్ ఇటీవల సినిమా క లో తనదైన శైలిలో యాక్టింగ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.. గత కొన్ని సంవత్సరాల నుంచి అన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ క సినిమా ఊపిరి పీల్చుకునేలా చేసింది.. ఈ సినిమా డే వన్ నుంచి పాజిటివ్ టాకింగ్ తో ముందుకు వెళ్ళింది. అంతేకాకుండా పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి.   

రహస్య గోరఖ్ ఇటీవలే జరిగిన క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తన స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకుంది. . “మా ఆయన కోసం ఈ సినిమా చూడండి” అంటూ ఎంతో క్యూట్ గా స్టేజ్ పై రిక్వెస్ట్ చేయడంతో కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది.   

గతంలో కిరణ్, రహస్య గోరఖ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కానీ వారికి సినిమాపై ఉన్న ఆసక్తి వల్ల.. ఈ స్థాయిలో నిలిచారు. వీరిద్దరి మొదటి సినిమా రాజావారు రాణిగారు కాగా.. ఈ సినిమా నుంచి వీరి ప్రేమ కూడా మొదలైందని తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link