Reduce Bad Cholesterol: ఈ 3 రసాలతో బాడీలోని కొలెస్ట్రాల్ మీరు వద్దన్నా 10 రోజుల్లో వెన్నల కరగడం ఖాయం..
బ్లాక్ బెర్రీల స్మూతీ కూడా శరీరంలోని కొలెస్ట్రాలను కరిగించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు నేచురల్ గా బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. తరచుగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు బెర్రీల స్మూతీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అధిక రక్తపోటుతో పాటు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే చాన్సులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా గుండె ధమనులతో పాటు సిరల్లో చెడు కొవ్వు పేరుకు పోతుంది. దీనికి కారణంగా సులభంగా గుండెపోటు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజు టమోటా రసం తాగాల్సి ఉంటుంది.
టమోటా జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు బాడీలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను వచ్చి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల వారాల్లో మంచి ఫలితాలు పొందుతారు.
గ్రీన్ టీ కూడా కొలెస్ట్రాలను కరిగించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. తరచుగా కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ ని ప్రతిరోజు రెండు నుంచి మూడుసార్లు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.