Tomatoes: పండగ వేళ ఆల్ టైమ్ రికార్డ్.. సెంచరీ దాటేసిన టమాట ధరలు.. కారణం ఏంటంటే..?

తెలంగాణలో టమాటాల ధరలు ఒక్కసారిగా సెంచరీని దాటేశాయి. రెండు వారాల క్రితం కేజీ టమాటాల ధరలు 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించారు. కానీ రెండు వారాల్లో గ్యాప్ లలోనే ఒక్కసారిగా టమాటా రెట్లు డబుల్, ట్రిబుల్ అయిపోయాయి.

దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రం బెంబెలెత్తిపోతున్నారు. ఒకవైపు టమాటాల ధరలు, మరోవైపు నిత్యవసరాలధరలు కూడా జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాకుండా.. దసరా పండగ సీజన్ కూడా రావడంతో జనాలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

కొంత మంది దళాలరు ఇదే అదనుగా భావించుకుని టమాటాల ఆర్టిఫిషియల్ కొరతను క్రియేట్ చేస్తున్నారు. ఇదే అదనుగా మార్కెట్ లలో ఇబ్బడి ముబ్బడిగా రెట్లను పెంచేస్తున్నారు. ఈ క్రమంలో టమాటాలు మాత్రం సెంచరీ దాటేసి.. డబుల్ సెంచరీవైపుగా వెళ్తుంది
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షం కురిసింది. దీంతో టమాటా పంట పూర్తిగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు కావాల్సిన టమాటాలు సైతం.. వరదల వల్ల పంట నష్టం జరిగిందని తెలుస్తోంది.
దీంతోనే టమాటాల పంటలేకపోవడం, మరోవైపు దిగుమతులు కూడా రాకపోవడంతో టమాటాల ధరలు అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
చాలాచోట్ల ప్రజలు ప్రభుత్వాలు ప్రత్యేకంగా కౌంటర్ లను ఏర్పాటు చేసి టమాటాలను విక్రయించాలని కోరుతున్నారు. కొంత మంది టమాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వీరిని కట్టడి చేయాలని కోరుతున్నారు.
అంతే కాకుండా.. టమాటాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని, ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని కోరుతున్నారు. దళారులను అరికట్టి .. కేవలం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా టమాటల కోసం ప్రత్యేకంగా కౌంటర్ లను ఏర్పాటు చేయాలన్నారు. మరో రెండు నెలల పాటు ఇదే విధంగా టమాట రేట్లు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది.