Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..
ప్రతి నెలా అమావాస్య, పౌర్ణమిలు వస్తాయి. అయితే, రేపు 18 వ తేదీ చంద్రగ్రహణ వస్తుంది. ఉదయం 6:11 నిమిషాల నుంచి 10:16 నిమిషాల మధ్యలో గ్రహణం జరుగుతుంది. మన దేశంలో ఈసారి చంద్రగ్రహణం కనిపించదు.
రాహువు మీన రాశిలో ఉన్నాడు కాబట్టి, గ్రహణ ప్రభావం మనదేశంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీన రాశిలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి గ్రహణం ప్రభావం ప్రధానంగా మీన రాశివారిపై ఎక్కువగా ఉంటుంది.
చంద్రగ్రహణం జరిగిన 15 రోజుల్లో సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది.అదేవిధంగా చంద్ర గ్రహణ ప్రభావం కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ, మేష రాశివారికి స్వల్పంగా ఉంటుంది. ఈ రాశులు జాగ్రత్తలు వహించాలి.
వృషభ రాశి.. వృషభ రాశివారికి 11 వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీరికి నక్కతోక తొక్కినట్లు అదృష్టం పడుతోంది. ఈ రాశివారికి ప్రతి పనిలో లాభాలు లభిస్తాయి.
మిథునరాశి.. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధి చూస్తారు. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వీరికి దశమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీరికి చాలామంచి కాలం. కానీ, ఈ రాశివారిని ఈ సమయంలో ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
సింహ రాశి.. ఈ రాశికి కూడా చంద్రగ్రహణం వల్ల శుభం కలుగుతుంది. కానీ, వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.
తుల రాశి.. ఈ రాశికి కూడా చంద్రగ్రహణం అదృష్టం. జాతకంలో ఆరో స్థానంలో గ్రహణం జరుగుతుంది. క్రీడల్లో ఉన్నవారికి ఇది మంచి కాలం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)