School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?

వానాలు ఇప్పటికే విజయవాడను ముంచాయి. ఈ సందర్భంగా ఏపీలో మరో తీవ్ర వాయుగుండం వేచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది.

ఈ మరో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విజయవాడలో తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ మొత్తం అతలాకుతలమయ్యాయి. ఈ సందర్భంలో 8 జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పార్వతిపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కృష్ణ, కాకినాడ, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గత రాత్రి నుంచి ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి అయితే రేపు కూడా విజయవాడలో భారీ వర్ష సూచన ఉంది గుంటూరు పాల్నాడు, బాపట్ల ప్రాంతాల్లో తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల మరోసారి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. సింగ్ నగర్ ,రాజరాజేశ్వరి నగర్ ప్రాంతాల్లో నీటిమట్టం పెరుగుతుంది. ఈ సందర్భంగా ఎనిమిది జిల్లాలోని స్కూలు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు సెలవులు రానున్నాయా ?అనే అంశంపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి నివేదిక రాలేదు.
అయితే ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో నమోదు కానున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరిక జారీ చేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు సెలవులు ఉన్నాయా? లేదా? అనేది అధికారికంగా క్లారిటీ ఈరోజు రాత్రి వరకు ఎదురు చూడాలి.