IPL2020: డాట్ బాల్స్ అత్యధికంగా వేసిన టాప్ 10 బౌలర్లు వీళ్లే..
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడి..తన టీమ్ ఫైనల్స్ కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఎన్రిచ్ నోర్త్ జే..ఐపీఎల్ 2020లో 160 డాట్ బాల్స్ వేశాడు.
ముంబై ఇండియన్స్ టీమ్ లో బలమైన బౌలర్ గా ఉన్న ట్రెయిన్ట్ బోల్ట్ ఐపీఎల్ 2020లో ఏకంగా 25 వికెట్లు తీశాడు. అంతేకాదు..157 డాట్ బాల్స్ వేశాడు.
కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తరపున ఆడిన రవి బిశ్నోయి...ఐపీఎల్ 2020లో 122 డాట్ బాల్స్ వేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మూలస్థంభమైన బౌలర్ గా ప్రత్యర్ధుల్ని ముప్పుతిప్పలు పెడుతూ ఈ ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 168 డాట్ బాల్స్ వేశాడు ఈ ఐపీఎల్ 2020 లో..
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన కాగిసో రబాడా అత్యధికంగా 30 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ సాధించాడు. అంతేకాదు..156 డాట్ బాల్స్ వేశాడు ఐపీఎల్ 2020 లో.
కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడిన మరో పవర్ ఫుల్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్..140 డాట్ బాల్స్ వేశాడు ఐపీఎల్ 2020లో.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో మరో ఆణిముత్యం పేస్ బౌలర్ టీ నటరాజన్. ఐపీఎల్ 2020లో 136 డాట్ బాల్స్ వేశాడు.
కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున ఆడిన పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కమ్మిన్స్ తో సమానంగా 140 డాట్ బాల్స్ వేశాడు ఐపీఎల్ 2020లో.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన జోఫ్రా ఆర్చర్..14 మ్యాచ్ లలో 20 వికెట్లు పడగొట్టాడు. అత్యధికంగా 175 డాట్ బాల్స్ వేశాడు ఐపీఎల్ 2020లో..
డెత్ ఓవర్లు వేయడంలో ప్రతిభ కలిగిన జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్య వహిస్తూ...జోఫ్రా ఆర్చర్ తో సమానంగా 175 డాట్ బాల్స్ వేశాడు ఐపీఎల్ 2020లో. టాప్ 10లో రెండో స్థానంలో నిలిచాడు.