Cricket Records: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాట్స్‌మెన్ వీళ్లే..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 57.32 బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సగటు ఇదే.. వన్డే క్రికెట్‌లో 13 వేల పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 102 పరుగులు అవసరం.
వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షెయ్ హోప్ 117 వన్డేలు ఆడగా.. సగటు 50.87గా ఉంది. ఇప్పటివరకు 15 సెంచరీలు, 24 అర్ధసెంచరీలతో 4,935 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచ కప్ నుంచి 54 ఇన్నింగ్స్‌లలో 2,414 పరుగులు చేశాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 350 వన్డే మ్యాచ్‌ల సగటు 50.57గా ఉంది. ధోనీ తన వన్డే కెరీర్‌లో 10,773 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైఖేల్ బెవన్ వన్డే సగటు 53.58. బెవాన్ 232 వన్డేల్లో 6,912 పరుగులు చేసి రిటైరయ్యాడు.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 101.7 స్ట్రైక్ రేట్‌తో 53.5 సగటుతో వన్డేల్లో పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో డివిలియర్స్ 9,577 పరుగులు చేశాడు.