Top 5 Best Selling Cars: నెక్సాన్, బ్రిజా, వేగన్ ఆర్ కంటే అత్యధికంగా విక్రయమైన కారు, ధర కూడా తక్కువే
మారుతి వేగన్ ఆర్
మారుతి వేగన్ ఆర్ సెప్టెంబర్ 2023లో అత్యధికంగా విక్రయమైన రెండవ కారు. మొత్తం 16,250 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 19 శాతం అమ్మకాలు పడిపోయాయి.
టాటా నెక్సాన్
సెప్టెంబర్ 2023లో టాటా నెక్సాన్ అత్యధికంగా విక్రయమైన మూడవ కారుగా ఉంది. మొత్తం 15,325 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. టాటా నెక్సాన్ మాత్రం గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగింది.
మారుతి స్విఫ్ట్
మారుతి స్విఫ్ట్ సెప్టెంబర్ 2023లో మొత్తం 14,703 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పరిగింది.
బ్రిజా
సెప్టెంబర్ 2023లో మారుతి సుజుకి బ్రిజా అత్యధికంగా విక్రయమైన నాలుగవ కారు. మొత్తం 15 వేల యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తక్కువ.
సుజుకి బలేనో
మారుతి సుజుకి బలేనో సెప్టెంబర్ 2023లో అత్యధికంగా విక్రయమైంది. మొత్తం 18,417 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 5 శాతం తక్కువే. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయానికి 19,369 యూనిట్ల విక్రయాలు జరిగాయి.