Best Superfoods: గుండె, మానసిక ఆరోగ్యం కల్గించే 5 సూపర్ ఫుడ్స్ ఇవే మలబద్ధకం ఇట్టే మాయం
గుడ్లు
మీ రెగ్యులర్ డైట్‌లో గుడ్లు ఉంటే ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ అందిస్తాయి. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చియా సీడ్స్
చియా సీడ్స్ కూడా సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బాదం
బాదంలో విటమిన్ ఎతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాంతో చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. రోజూ బాదం తినడం వల్ల మస్తిష్కానికి కూడా మంచిది.
వాల్‌నట్స్
వాల్‌నట్స్ తినడం వల్ల హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. దాంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాల్‌నట్స్ మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీని కొంతమంది పచ్చిగా సలాడ్ రూపంలో , మరికొంత మంది వండుకుని తింటారు. బ్రోకలీ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి ఆరోగ్యానికి లాభదాయకం.