Ev Cars: ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.15 లక్షల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు

Tue, 24 Sep 2024-3:00 pm,

Electric car discounts: కొన్నిరోజుల్లో దేశంలో పండగల సీజన్ షురూ కానుంది. తమ విక్రయాలను పెంచుకునేందుకు కార్ల కంపెనీలు  కళ్లు చెదిరే డిస్కౌంట్స్ తోపాటు ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ నెలలో మీరు కొత్త కారు కొనాలని ప్లాన్  చేసినట్లయితే మీకో ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కార్ల పై ఏకంగా రూ. 15లక్షల వరకు ఆదా అవుతుంది. ఇంత భారీ డిస్కౌంట్ ప్రకటించడానికి కారణం ఓల్డ్ స్టాక్  మిగిలిపోవడమే. పలు నివేదికల ప్రకారం కారు కంపెనీలు ఉత్పత్తిని చాలా వరకు తగ్గించాయి. సెప్టెంబర్ నెలలో భారీ డిస్కౌంట్లను అందిస్తున్న ఈ టాప్ 5 కార్ల గురించి పూర్తి వివరాలు చూద్దాం.   

ఈ నెల, కియా తన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV EV6పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. EV6ని కొనుగోలు చేయడానికి మీకు ఇంతకంటే మంచి అవకాశం లభించకపోవచ్చు. మీరు ఈ నెలలో Kia EV6లో రూ. 15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. Kia EV6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 60.97 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారుపై లభించే డిస్కౌంట్ నిజంగానే అతిపెద్ద తగ్గింపు.

ఈ నెల, టాటా మోటార్స్ దాని చౌకైన ఎలక్ట్రిక్ SUV పంచ్ EVపై రూ. 1.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ SUV  ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 14.29 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం, మీరు దానిపై అందుబాటులో ఉన్న భారీ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందవచ్చు.  

మీరు Tata Nexon EVని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ నెలలో ఈ వాహనంపై చాలా మంచి ఆఫర్ ఉంది. నెక్సాన్ EVపై ఈ నెలలో రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షలు.  

ఈ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ BMW తన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV iX1 పై రూ.7 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.  ఈ తగ్గింపు ఈ నెల (సెప్టెంబర్) వరకు మాత్రమే  ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.  ఈ SUV ఎక్స్-షో ధర రూ.66.90 లక్షలు.దీనిపై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో BMW iX1ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.   

మీరు ఈ నెలలో MG ZS EVని కొనుగోలు చేస్తే రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ పొందుతారు. ఇది చాలా మంచి రేంజ్, ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ SUV. ఈ మొత్తం తగ్గింపులో ఎక్స్ఛేంజ్ బోనస్ తోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది. ఈ కారు ధర రూ.18.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link