Business Ideas: నెలకు 2 లక్షలు పక్కా.. దసరా, దీపావళి సీజన్ లో ఈ బిజినెస్ చేస్తే చాలు.. ఓ లుక్కేయిండి..

Sun, 22 Sep 2024-2:55 pm,

ఇటీవల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.ఎవరు కూడా ఖాళీగా కూర్చునేందుకు అస్సలు ఇష్టపడటంలేదు..  ఇంట్లో ఉన్న కొంత మంది మహిళలు తమకంటూ లాభాలు కలిగేలా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..  ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో దసరా,దీపావళి పండుగలు వస్తున్నాయి. ఈ సీజన్ లో కొన్ని బిజినెస్ లో ఉన్నాయి.అవి చేస్తే మాత్రం నెలకు  2 లక్షలు పక్కా అంటున్నారు మార్కెటింగ్ పండితులు. అవేంటో ఇప్పుడు ఓ లుక్కెద్దాం.

దసరా లేదా దీపావళి పండుగలు వచ్చిన.. అందరి ఇంట్లో పూజలు తప్పకుండా ఉంటాయి. ఒకప్పుడు.. జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కడ చూసిన న్యూక్లియర్ ఫ్యామిలీలే. పండుగ పూట అందరు పూజలు చేస్తుంటారు. అయితే.. పూజలు చేసేటప్పుడు వాడే పూజ సామాన్లు అన్ని ఒకే చోట దొరికేలా బిజినెస్ లు చేస్తే లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక షెడ్ లేదా మన ఇంట్లోనే వీధిలో ఉండే రూమ్ లో.. పూజా సామన్లన్నింటిని ప్యాక్ చేసి అమ్మితే ఫుల్ గిరాకీ ఉంటుంది.

అదే విధంగా ఏ పండుగొచ్చిన కూడా అందరికన్నా.. స్పెషల్ గా కన్పించాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకు చాలా మంది యువత.. బ్యూటీషియన్ కోర్సులలో జాయిన్ అవుతున్నారు. ఇంట్లోనే బ్యూటీకి చెందిన కొన్ని ప్రాడక్ట్స్ పెట్టుకుని,  కస్టమర్ లకు ఫెషియల్, హైబ్రోస్, మాయిశ్చరైజింగ్, హెయిర్ రీమూవల్ వంటి బిజినెస్ చేస్తే బోలేడు ప్రాఫిట్స్ అర్జించవచ్చు.  

చాలా చోట్ల దసరా, దీపావళిలను పెద్ద పండుగలా జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్త బట్టలు కొనందే.. వేసుకొంది అస్సలు పండగ ఫీలింగ్ రాదు. అందుకు చాలా మంది పండగ రాగానే.. చిన్న పెద్ద తేడా లేకుండా బట్టల షాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి కొత్త బట్టల బిజినెస్ ను ఈ సీజన్ లో పెట్టుకున్న కూడా షార్ట్ టైమ్ లో కళ్లు చెదిరే లాభాలు వస్తాయనడంలో ఏమాత్రంర డౌట్ అక్కర్లేదు.  

పండగ సీజన్ లో చాలా మంది స్వీట్లు తప్పకుండా తింటుంటారు. మన ఇళ్లలోకి వచ్చే అతిథులకు ఏదైన స్పెషల్ స్వీట్ లు పెట్టందే.. అస్సలు బైటకు పొనివ్వరు. అందుకే లడ్డులు, ఇతర స్వీట్ ల బిజినెస్ లు పెట్టుకున్న కూడా బోలేడా లాభాలు వస్తాయి. 

తెలుగు స్టేట్స్ లలో ముఖ్యంగా చకినాలు, గవ్వలు, మురుకులు, అటుకులు తప్పకుండా చేసుకుంటారు. ఇలాంటివి చేసుకొవడం వల్ల కూడా ఫుల్ పాఫ్రిట్స్ వస్తాయి. అందుకే వీటిని తయారు చేసే అమ్మవారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇటీవల నూనెల రేట్లు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఆయిల్ వంటకాలు చేయడం రిస్క్ తో కూడుకున్న పని. అందుకు బైట నుంచి కొనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

టపాకాయాలు.. ఇక దీపావళి సీజన్ లో.. క్రాకర్స్ అను ప్రతిఒక్కరు పేలుస్తారు. క్రాకర్స్ బిజినెస్ లో మాత్రం మనం హోల్ సెల్ లో కొన్నదానికి డబుల్ ఇన్ కమ్ వస్తుందని చెప్పుకొవచ్చు. అందుకు చాలా మంది దీపావలి వచ్చిందంటే చాలా క్రాకర్స్ బిజినెస్ ను తప్పకుండా చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది కేవలం అతి తక్కువ కాలంలో రాబడిని ఇస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link