Top Bikes Under 2 Lakhs: 2 లక్షల్లోపు ధరలో లబించే టాప్ 5 బైక్స్, , వాటి ఫీచర్లు ఇలా

Sat, 03 Feb 2024-6:54 am,

Yamaha R 15S

యమహా ఆర్ 15 ఎస్ ప్రారంభ ధర1.65 లక్షలు. ఇండియాలో 1 వేరియంట్ 2 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కూడా రెండువైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 

TVS Ronin

ఇది స్టైలిష్ అండ్ మస్క్యులర్‌లా ఉంటుంది. మోడర్న్ క్రూయిజర్ లుక్ కలిగి ఉంటుంది. ఇందులో 4 వేరియంట్లు 7 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 225.9 సీసీ, బీఎస్ 6 ఇంజన్ ఉంటుంది ఇది 20.1 బీహెచ్‌పి పవర్, 19.33 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్దుంది. డ్యూయల్ ఛానెల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర 1.49 లక్షల రూపాయలు

Bajaj NS 200

బజాజ్ ఎన్ఎస్ 200 స్టైలిష్ నేక్డ్ డిజైన్‌తో వస్తోంది. పల్సార్ ఎన్ఎస్ 200 లో 1999.5 సిసి, బీఎస్ 6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 24.13 బీహెచ్‌పి , 18.74 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్ ఉంటాయి. దాంతో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ బైక్ బరువు 159.5 కిలోలు. ఈ బైక్ దర 1.42 లక్షల రూపాయలు

Royal Enfield Hunter 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అనేది రోడ్‌స్టర్ బైక్ . ఇదులో 3 వేరియంట్లు, 10 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. హంటర్ 350 బీఎస్ 6 ఇంజన్‌తో వస్తోంది. 20.2 బీహెచ్‌పి పవర్, 27 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ అం్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉండటం ప్రత్యేకత. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. ఈ బైక్ ధర 1.49 లక్షలు. 

TVS Apache RTR 200 4 V

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధర 1.42 లక్షలు. ఇందులో 2 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 200 సిసి సింగిల్ సిలెండర్ బీఎస్ 6 ఇంజన్ ఉంటుంది. స్పోర్ట్ బైక్‌లా కన్పిస్తుంది. ఈ బైక్ ఇంజన్ 20.54 బీహెచ్‌పి పవర్, 17.25 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా రెండు వైపులు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link