ఈ దీపావళికి ఇంటికి వచ్చే బంధుమిత్రులను అందమైన ముగ్గులతో ఆహ్వనించండి
ముగ్గుల్లో చాలా కామన్ గా కనిపించినా ఈ డిజైన్ స్పెషల్ ఎట్రాక్షన్ ఉన్నదే. ఎందుకంటే ఇందులో చాలా రకాల రంగులు. అయితే ఇప్పుడిప్పుడే ముగ్గులు ( Muggulu ) వేసే వారు మాత్రం కాస్త ఆలోచించి ప్రారంభించండి. అయితే ముందుగా నేలపై ఒక డ్రాయింగ్ వేస్తే కొత్త వారు కూడా అదరగొట్టగలరు అని మాత్రం చెప్పగలం.
రంగులు, డ్రాయింగ్స్ వద్దనుకుంటే ఇలా ప్లోరల్ ముగ్గులను కూడా డిజైన్ చేయవచ్చు. ఇదే ప్యాటర్న్ లో చేయాలి అని ఏం లేదు. మీకు నచ్చిన పువ్వులతో, నచ్చిన డిజైన్ల ముగ్గు వేసుకోవచ్చు.
దీపావళి లుక్ కోసం ఈ ముగ్గు చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీరు రంగులు వాడవచ్చు, పువ్వులు కూడా వాడవచ్చు, జీవం కనిపించాలి అంటే దీపాలు కూడా పెట్టవచ్చు. దీపావళి రోజు సాయంత్రం పెడితే రాత్రి అయ్యే వరకు అద్భుతంగా వెలుగుతూనే ఉంటాయి.
ఈ రంగోలి కొంచెం ఖరీదైంది. అయితే కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇందులో కనిపించే మెటీరియల్ తీసుకొస్తే చాలు మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు.
మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఆక్రోలిన్ తీసుకుంటే చాలు సులువుగా ఇలా ముగ్గు డిజైన్ వేయవచ్చు