Riboflavin Rich Foods: మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉంటే ఇక విటమిన్ బి2, బి3, బి4, బీ6 కొరత లేనట్టే
పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు, పన్నీరు వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి2 లేదా రిబోఫ్లెవిన్ , విటమిన్ బి3, విటమిన్ బి12 లేదా కోబాలమిన్ పుష్కలంగా ఉంటాయి. పాలను అందుకే కంప్లీట్ ఫుడ్ అంటారు. రోజూ ఓ గ్లాసు పాలు తాగితే చాలు
గుడ్లు
చాలామంది ప్రోటీన్లు కోసం గుడ్లు ఎక్కువగా తింటుంటారు. రోజకు 2 గుడ్లు తింటే శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది.
బ్రోకలీ
నిస్సందేహంగా ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి. ఇందులో విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్, నయాసిన్ లేదా విటమన్ బి3, పైరిడోక్సిన్ లేదా విమటిన్ బి6 చాలా అవసరం. ఇవి బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి.
ఫ్యాటీ ఫిష్
మాంసాహారంలో విటమిన్ బి2 లేదా రిబోఫ్లెవిన్ పుష్కలంగా ఉంటుంది. ఫ్యాటీ ఫిష్ ఇందుకు బెస్ట్. సాల్మన్, ట్యూనా, మ్యాక్రెల్, సార్డిన్ చేపలు తీసుకుంటే మంచిది
పెసర పప్పు
పెసర పప్పు అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇందులో విటమిన్ బి2 లేదా రిబోఫ్లెవిన్, విటమిన్ బి3 లేదా నయాసిన్, విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్ పుష్కలంగా ఉంటాయి.