Budget Smart Phones: రూ.8 వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్... పూర్తి వివరాలివే...

Sun, 27 Feb 2022-6:02 pm,

Techno Spark 8C: రూ.8వేల లోపు ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో టెక్నో స్పార్క్ 8సీ ఒకటి. 6.6 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 6GB RAM, ఏఐ ఎనేబుల్డ్ డ్యూయల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఫీచర్స్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.7,499.  

Samsung Galaxy M02 : శాంసంగ్ గెలాక్సీ ఎ02 6.5-అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తోంది. ఈ ఫోన్ MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. దీని ధర రూ.7999.  

Real Mi C21 : రియల్ మీ సీ21 6.5 అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తోంది. ఇది  MediaTek Helio G35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. దీని ధర రూ.7999.

Redmi 9A : రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ 6.53 అంగుళాల డిస్ ప్లేతో లభిస్తోంది. ఇందులో MediaTek Helio G25 ప్రాసెసర్ అమర్చబడి ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.6799కి మార్కెట్‌లో అందుబాటులో ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link