Farmer Schemes: అన్నదాతలకు మేలు చేకూర్చే 5 కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు

Mon, 13 Sep 2021-3:19 pm,

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం( Prime minister Samman Nidhi Scheme).ఈ పథకం కింద ప్రభుత్వం చిన్న రైతులకు ఏడాది వ్యవధిలో 3 వాయిదాల్లో 6 వేల రూపాయలు అందిస్తుంది. ప్రతి వాయిదాలో రైతు ఖాతాలో 2 వేల రూపాయలు నగదు బదిలీ అవుతుంది. ఈ పథకం చిన్న, సన్నకారు రైతు కుటుంబాల కోసం ఉద్దేశించింది. కుటుంబంలో అందరికీ కలిపి 2 హెక్టార్ల వరకూ భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. దీనికోసం మీరు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ నుంచి CSC అక్కౌంట్ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. అటు కిసాన్ పీఎం సమ్మన్ నిధి పథకం అధికారిక వెబ్‌సైట్  లేదా PM Kisan GOI Mobile App ద్వారా కూడా ఈ పథకం లబ్ది పొందవచ్చు.

ప్రధానమంత్రి ఆవాస్ పథకం( Prime minister Awas Scheme).ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం 2022 వరకూ సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలకు పక్కా ఇళ్లు కల్పించడమే. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లలో ఉండేవారికి ఈ పథకం కింద ఇళ్లు లభిస్తాయి. PMAY-Gలో మీరు 6 లక్షల రూపాయల రుణాన్ని 6.5 శాతం వడ్డీకే తీసుకోవచ్చు. ఇళ్లు లేదా కనీస మౌళిక సదుపాయాలైన విద్యుత్, వంట చేసుకునే ప్రాంతంతో పాటు 25 స్క్వేర్ మీటర్లు ఉండాలి. ఒకవేళ ఇళ్లు నిర్మించేందుకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు అవసరమైతే...బ్యాలెన్స్ మొత్తాన్ని సాధారణ వడ్డీరేటుకు తీసుకోవచ్చు.

ప్రధానమత్రి జన్‌ధన్ పథకం( Prime minister Jandhan Scheme). ఈ పథకం కింద పేదవారికి జీరో బ్యాలెన్స్‌పై  బ్యాంక్ అక్కౌంట్, పోస్ట్ ఆఫీస్ అక్కౌంట్ తెరుస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కీలకమైన ఆర్ధిక ప్రణాళికల్లో ఇదొకటి. ఈ పథకం కింద పేదవాడు బ్యాంకు ఖాతాను సునాయసంగా తెర్చుకోగలడు. ఈ పథకం కింద తెరిచిన పథకాల్లో అక్కౌంట్ హోల్డర్‌కు మొత్తం 1 లక్షా 30 వేల మేర ప్రయోజనం కలుగుతుంది. ఇది కాకుండా ప్రమాద భీమా కూడా వర్తిస్తుంది. అక్కౌంట్ హోల్డర్‌కు ప్రమాద భీమా కింద లక్ష రూపాయలతో పాటు 30 వేల రూపాయుల జనరల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. 

ప్రధానమంత్రి పంట భీమా పథకం (Prime minister Crop Insurance Scheme).వర్షాలు, తుపాను, గాలివాన, వడగండ్లు, భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తులతో ఎదురైన నష్టం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రధానమంత్రి పంట భీమా పథకాన్ని రైతుల కోసం ప్రారంభించారు. ఈ పథకం కింద భీమా పరిమితిని పెంచి 40 వేల 7 వందల రూపాయలు చేశారు. ఈ పథకం కింద ఇంతకుముందైతే ప్రతి హెక్టార్‌కు 15 వేల 1 వంద రూపాయలుండేది. ఈ పథకంలో విత్తు నుంచి మొదలుకుని..పంటకోత వరకూ మొత్తం కాల పరిమితి ఉంటుంది. ఈ పథకం కింద విత్తు ఆగిపోయినా లేదా పంట పాడైనా నష్టపరిహారం ఉంటుంది. 

కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card).ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీంతో అన్నదాతలకు సమయానికి రుణం లభిస్తుంది. రైతులకు స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయడమే ఈ పథకం ఉద్దేశ్యం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD)ఈ పథకాన్ని అందిస్తోంది. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డును ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో అనుసంధానం చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి రైతులు 3 లక్షల వరకూ రుణాన్ని 4 శాతం వడ్డీపై తీసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link