WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?

సమ్మర్ లో ముఖ్యంగా పుచ్చకాయలు మార్కెట్లో ఎక్కువగా అమ్మకానికి వస్తుంటాయి. దీన్ని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. పుచ్చకాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో దాదాపు 95 శాతం వరకు నీటి కంటెంట్ ఉంటుందని చెబుతారు.

పుచ్చకాయలను ఉదయం పరగడుపున తింటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ఇమ్యునిటీని పెంచుతుంది. జీవక్రియలను యాక్టివ్ చేస్తుంది. దీంతో రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటూ, మన పనులు మనం చేసుకుంటు ఉంటాం.

మెయిన్ గా పుచ్చకాయలో విటమిన్ బి, సి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. కొందరు సమ్మర్ లో నీళ్లలను ఎక్కువగా తాగరు. అలాంటి వారు పుచ్చకాయలను తింటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. శరీరంలో నీటిశాతాన్ని ఇది కవర్ చేస్తుంది.
మనశరీంలోని ఎసిటిక్ స్వభావం ను తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థపదార్థాలను బైటకు వెళ్లేలా చేస్తుంది. రక్తం సరఫరాను క్లీన్ చేస్తుంది. మూత్రపిండాల పనితీరుపు కూడా మెరుగు పరుస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
పుచ్చకాయలో విటమని ఏ ఉండం వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలను కూడా దూరంచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. వేసవిలో చాలా మంది మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కొందరిలో రాత్రిపూట మూత్రం మంటగా వస్తుంది.
ఇలాంటి సమస్యలున్న వారు పుచ్చకాయలను లేదా జ్యూస్ ను డైలీ తాగితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేయోచ్చు. పుచ్చకాయలను ముక్కలుగా చేసి కంటి మీద పెట్టుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. అదే విధంగా పుచ్చకాయముక్కలను ముఖంపై ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే, నల్లని మచ్చలు, బ్లాక్ హెడ్స్ దూరమైపోతాయి.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)