సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Toyota, ధర ఇతర వివరాలు తెలుసుకోండి
కొత్తగా లాంచ్ అయిన టోయోటా క్రిస్టాలో లావుపాటి క్రోమ్ సరవుండ్ తో పాటు మరింత లెగ్గర్ గ్రిల్ అందించారు. గతంతో పోల్చితే ఎక్కువ స్లైట్స్ ఇచ్చారు. డెడ్ ల్యాంప్ ఔట్ గోయింగ్ మోడల్ (Headlamps outgoing model) లాగే ఉంటుంది. ఇందులో గ్రిల్ పై క్రోమ్ ఎక్స్ టెన్షన్ (Chrome extension) కూడా ఇచ్చారు. ఇక అప్డేడెట్ ఇంజిన్ లో క్రిస్టాలో 16 ఇంచుల డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇది ఇండియన్ మోడల్స్ లో ప్రత్యేకం అనిపిస్తోంది. ఫ్రంట్ బంపర్ లో షార్ప్ లుక్ ఇచ్చారు. ఒక బ్లాకౌట్ చిన్ తో అందించారు. ఫ్రంట్ బంపర్ పై పెద్ద టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. రౌండ్ ఫాగ్ ల్యాంప్ తో పాటు కొత్త డిజైన్ ఇచ్చారు. హై వెరియంట్ పై ఎల్ఈడి యూనిట్ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న కలర్ ఆప్షన్స్ తోపాటు, 2020 మోడల్ అప్డేట్స్ లో కొత్త కలర్ అప్షన్స్ కూడా ఇచ్చారు. స్పార్ల్కింగ్ బ్లాక్ , క్రిస్టల్ షైన్ అనే ఛాయిస్ ఇచ్చారు. సెక్యూరిటీ కోసం ఫ్రంట్ క్లియర్ సోనార్ అందించారు. ఈ కాస్మోటిక్, ఫీచర్ అప్డేట్స్ మినహా ఇంజిన్ లో పెద్ద మార్పులు ఏమీ లేవు.
ఇక కార్ లోపలికి వెళ్తే, 2021 ఇన్నోవా క్రిస్టా టాప్ ట్రిమ్ లో లెదర్ సీట్స్ ఇచ్చారు. దాంతో పాటు దీని ఇంపోటైన్మెంట్ సిస్టమ్ కోసం స్టాండర్స్ ఆండ్రాయిడ్ ఆటో (Standard Android Auto), యాపిల్ కార్ ప్లే (Apple Carplay) సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో వాల్యూమ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రత్యేక బటన్ ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్క సెన్సార్ అదనం.
ఈ సారి కార్ లో కొత్త అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఫెమీలియర్ ఇంటీరియర్ లేఔట్ (Familiar Interior Layout) కూడా ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు కొత్త స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్ స్క్రీన్ ఆడియో తో వస్తుంది. దీంతో పాటు కార్ కనెక్ట్ లో రియల్ టైమ్ ట్రాకింగ్, జీయోఫెన్సింగ్, పార్క్ లొకేషన్ కూడా వినియోగించుకోవచ్చు. మొత్తం 8 సీట్లు ఉంటాయి.
ఇంజిన్ సామార్థ్యం గురించి మాట్లాడితే BS6 2.4 లీటర్ల (Diesel Engine) ఉంటుంది. ఇది 148bhp పవర్ 360Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండో ఇంజిన్ లో 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో 164bhp పవర్ 245Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్స్, ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. వెరియెంట్ ను బట్టి 30,000 నుంచి 60,000 వరకు అధికంగా చెల్సిచాల్సి ఉంటుంది.