Latest Village Business Ideas: ఊళ్లో ఉండే యువతకు ది బెస్ట్ బిజినెస్.. ఆడుతూ.. పాడుతూ ప్రతి నెల రూ.30,000 సంపాదించవచ్చు!
చిన్న వ్యాపారాలు ఆర్థిక వృద్ధికి ప్రధాన కారకం అని నిపుణులు చెబుతున్నారు. అవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. అలాగే వ్యాపారాలు స్థానిక సమాజానికి సేవ చేస్తాయి, వినియోగదారులకు వివిధ రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తాయి.
చిన్న వ్యాపారాలు కొత్త ఆలోచనలు, ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయి. ఇది మార్కెట్‌ను మరింత పోటీగా మారుస్తుంది. ఈ వ్యాపారాలను ప్రారంభించడానికి మీరు అధిక పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అతి తక్కువ పెట్టుబడిలతో కూడా ఈ బిజినెస్‌లను స్టార్ట్ చేయవచ్చు.
ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం పల్లెటూరులో చిన్న వ్యాపారం ప్రారంభించడం ఎలా ? ఏలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు? అనే అంశాల గురించి మీరు ఇక్కడ పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకొనే బిజినెస్ చిన్న మార్కెట్ గురించి. ఈ బిజినెస్‌తో మీరు నెలకు రూ. 10,000 నుంచి రూ. 30,000 సంపాదించవచ్చు.
పట్టణాల్లో ఇప్పుడు కూరగాయలు కొనడానికి మార్కెట్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి తగ్గిపోయింది. అన్నిటికీ ఆన్‌లైన్ డెలివరీ అందుబాటులో ఉండడంతో మనం ఇంటి నుండే కూర్చుని అవసరమైన వస్తువులన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు.
కానీ పల్లెటూర్లలో ఈ సౌకర్యం ఇంకా అంతగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికీ మార్కెట్‌కే వెళ్ళాల్సి వస్తోంది. ఇది ఒకవైపు కష్టమే అయినప్పటికీ మరోవైపు తాజా కూరగాయలు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్ల మనకు మంచి నాణ్యమైన ఆహారం లభిస్తుంది.
ఈ చిన్న ఆలోచనతో మీరు మంచి ఆర్గానిక్ కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది రసాయనాలు లేని సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలు కాబట్టి ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఈ వ్యాపారంతో మీరు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్వయం ఉపాధిని సృష్టించుకోవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద మద్దతు ఇవ్వవచ్చు.
స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అవసరాన్ని గమనించి మీరు ఒక చిన్న బిజినెస్‌ను స్టార్ట్ చేసి ఆదాయం పొందవచ్చు. వ్యాపారం ప్రారంభించే ముందు మీ గ్రామంలో ఏ వస్తువులు లేదా సేవలు అందుబాటులో లేవు? ఎలాంటి వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం చాలా ముఖ్యం.
వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం? మీ వద్ద డబ్బు లేకపోతే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవచ్చు. కూరగాయలను తాజాగా ఉంచడానికి సరైన వాహనం అవసరం. మీ బిజినెస్ గురించి ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా, ఫ్లయర్స్ వంటి వాటిని ఉపయోగించండి. కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మీ సేవలను మెరుగుపరచండి.
మీరు కేవలం కూరగాయలను మాత్రమే కాకుండా పండ్లను కూడా అమ్మడం వల్ల మరింత లాభం కలుగుతుంది. జనాలు కూడా పెరుగుతారు. బిజినెస్ ప్రారంభించడానికి అతి తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా మీరు నెలకు రూ. 10,000 నుంచి రూ. 30,000 సంపాదించవచ్చు.
ముఖ్యంగా ఈ బిజినెస్ స్టార్ట చేయాడినికి కావాల్సిన లైసెన్స్, ఆహార భద్రతా లైసెన్స్, GST నమోదు చేసుకోవడం తప్పనిసరి. మీరు కూరగాయలను బహిరంగంగా అమ్ముతున్నట్లయితే మునిసిపల్ లైసెన్స్ అవసరం కావచ్చు. కూరగాయలను తూకం వేసి అమ్ముతున్నట్లయితే ఈ అనుమతి తప్పనిసరి.