Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..?

Fri, 14 Jun 2024-8:42 pm,

జ్యోతిష్య పండితుల ప్రకారం.. కొన్ని యోగాలు మనిషి జీవితంలో గొప్ప మార్పులకు కారణమౌతుంటాయి. వీటి వల్ల బండ్లు ఓడలౌతాయి.. ఓడలుబండ్లు అవుతాయి అన్న విధాలుగా వీటి ఫలితాలు ఉంటాయి. జూన్ 16 నుంచి శుక్రుడు, శని, బుధుడు కలవడం వల్ల సింహరాశిలో శక్తివంతమై త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.

దీని ప్రభావం నాలుగు రాశులపై అధికంగా చూపిస్తుంది. అంతేకాకుండా ద్వాదశ రాశులపై అత్యధికంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో పై నాలుగు రాశుల వారు ఏపనిచేసిన, ఏది అనుకున్న వెంటనే జరిగిపోతుందని చెబుతుంటారు. 

వృషభ రాశి.. ఈ రాశివారికి త్రిగ్రహి ప్రభావం వల్ల మీరు ఇప్పటి వరకు రాదనుకుని వదిలేసిన డబ్బులు మీకు వచ్చిచేరుతాయి. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. మీకు పెళ్లి కుదిరే చాన్సులు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

సింహారాశి.. ఈ రాశి వారికి విదేశీయానం కన్పిస్తుంది. వీరికి బంధువులతో ఏర్పడిన వివాదాలు దూరమైపోతాయి. సంతానం విషయంలో అనారోగ్య సమస్యలు అన్ని దూరమైపోతాయి. మిత్రులతో ఆనందంగా ఉంటారు.

తుల రాశి.. ఈ రాశి వారికి సాడేసాతి ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాకుండా.. ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. మీరు ఏపని చేపట్టిన కూడా అందులో విజయం సాధిస్తారు. స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

మీనరాశి.. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link