Triptii Dimri: సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసిన యానిమల్ భామ తృప్తి డిమ్రి..
తృప్తి డిమ్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 యేళ్లు అవుతున్న.. లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.
యానిమల్ చిత్రంలో తృప్తి స్కిన్ షోకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ భామను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగింది. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ మరో హిట్ ను అందుకుంది. తృప్తి నటించిన ఈ బూతు సినిమాకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం చూసి క్రిటిక్స్ సైతం నోరెళ్ల బెట్టారు.
అంతేకాదు తృప్తి.. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్.. స్పిరిట్ తో పాటు.. ‘యానిమల్ పార్క్’ సినిమాల్లో నటిస్తోంది. అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల్లో తృప్తికి స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్టు సమాచారం.
తృప్తి విషయానికొస్తే.. 2017లో శ్రీదేవి టైటిల్ రోల్ లో నటించిన ‘మామ్’ మూవీలో చిన్న పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక 2018లో రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు తృప్తికి మంచి పేరు తీసుకొచ్చాయి. తృప్తి డిమ్రి 2021లో ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో పేరు సంపాదించుకుంది. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.
తృప్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. అంతేకాదు ఇంగ్లీష్ హానర్స్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదవు కంప్లీట్ అయిన తర్వాత పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంది. లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీలో రణబీర్ కపూర్ తో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది.
మొత్తంగా యానిమల్ మూవీతో వచ్చిన పాపులారిటీ బ్యాడ్ న్యూస్ సినిమాకు బాగానే కలిసొచ్చింది. తాజాగా ఈమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. అటు సలార్ 2లో ప్రభాస్ తో ఈ భామ చిందేయనున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాపై క్లారిటీ రానుంది.