Thalapathy Vijay: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. త్రిష షాకింగ్ పోస్ట్..!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తమిళ కుట్టి త్రిష , అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు , తమిళ్ , కన్నడ భాషలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, చిరంజీవి , బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన పాపులారిటీ మరింత పెంచుకుంది.
ఇకపోతే యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఈమె క్రేజ్ కాస్తా తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయింది. ఇక ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ విజయ్, లోకేష్ కనగరాజు కాంబినేషన్లో వచ్చిన లియో సినిమాలో కీలకపాత్ర పోషించింది. లియో సినిమా సక్సెస్ కావడంతో త్రిషకి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
ఈ మధ్యకాలంలో సౌత్ స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్ , మోహన్ లాల్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. త్రిష వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవాలనుకున్న ఈమె.. అది కుదరక నిశ్చితార్థంలోనే ఆగిపోయింది.
ఇక ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న ఈమె విజయ్ తో ఎఫైర్ నడుపుతోందంటూ ఒక రూమర్ తెగ హల్చల్ చేసింది. ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు విజయ్ తమిళనాడులో తన సొంత రాజకీయ పార్టీ తమిళ వెట్రి కళగం స్థాపించారు. ఈ నేపథ్యంలోనే త్రిష చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
త్రిష తన పోస్టులో.. నేను ప్రజలను దూరంగా ఉంచుతాను. ఎందుకంటే నాకు కుక్కలంటే చాలా ఇష్టం. కానీ నా పెంపుడు జంతువులు ఇతర కుక్కలను కాకుండా ప్రజలను ప్రేమిస్తాయి. అందుకే అందరం కలిసి ప్రేమ సమాజాన్ని స్థాపిద్దాం అంటూ రాసింది. కానీ త్రిష విజయ్ కి ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్ లు అనుకుంటున్నారు. మరి త్రిష ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియడం లేదు.