Trisha Krishnan::రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష.. వరుడు ఎవరంటే..?

Sun, 22 Sep 2024-12:13 am,

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో హీరోయిన్ త్రిష రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతే కాదు గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి చట్టపట్టలేసుకొని తిరగడమే కాదు,  త్రిష విజయ్ తో కలిసి పలు సినిమాలలో నటించింది. 

బయట ఎక్కడపడితే అక్కడ ఆయనతో తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు తన సినీ కెరియర్ లో  ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉండే ఈమె తాజాగా విజయ్ కోసం విజయ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 

అంతేకాదు ఇటీవల విజయ్ పుట్టినరోజు కాగా ఒక పాటను కూడా యాడ్ చేసి మరీ విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిందట. ఈ క్రమంలోనే  త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రైవేట్ ఫోటోని కూడా లీక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్తడే పార్టీకి కూడా ఈమె వచ్చిందని , ఆ సమయంలో విజయ్ కి ఖరీదైన డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చిందని సమాచారం. 

విజయ్ కూడా కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను త్రిషకు బహుకరించి, ఒక రింగును కూడా ఆమె వేలికి తొడిగారట. దీంతో నిశ్చితార్థం చేసుకున్నారనే  వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడేకంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇదే సమయంలో హీరో విజయ్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారనే వార్త తెరపైకి వచ్చింది. 

త్రిష కారణంగా హీరో విజయ్ తన భార్య సంగీతా కి ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అందుకే రహస్యంగా త్రిషను నిశ్చితార్థం చేసుకున్నారని,  త్వరలోనే భార్యకు విడాకులు ఇచ్చి ఈమెను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.   

గతంలో తన భార్యతో కలిసి ఈవెంట్స్ కి హాజరయ్యే  విజయ్,  ఇప్పుడు ఒంటరిగా కనిపిస్తున్నాడు.  అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని,  విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు కోలీవుడ్ కథనాలలో వైరల్ గా మారుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link