TTD Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక ఈజీగా దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దగ్గరకు భారీ ఎత్తున భక్తులు వెళ్తుంటారు. ఆస్వామి వారికి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వరుసగా సెలవుల నేపథ్యంలో తిరుమలలో రష్ ఎక్కువగా ఉంటుంది.
కొన్నినెలలుగా తిరుమలలో లక్షలాదిగా భక్తులు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో గత ప్రభుత్వం తిరుమలలో సరైన ఏర్పాట్లు, వసతి సదుపాయలు కల్పించలేదని తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం మారవడంతో పాటు తిరుమలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కాన్సెన్ ట్రేషన్ చేశారు.
ఇటీవల తిరుమలకు నూతన ఈవోగా శ్యామల్ రావును ప్రభుత్వం నియమించారు. ఆయన టీటీడీ పరిధిలోని అన్ని విభాగాలను తనిఖీ చేస్తున్నారు. భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డు, అన్నదానం విధానంలో ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమల మాడవీధుల్లో కాలి నడకన వెళ్లే భక్తులు.. ఎండ వేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మాడవీధుల్లో కూల్ పెయింట్ వేయించారు. కొందరు వ్యాపారులు అధిక ధరలకు పూజ సామాన్లు విక్రయిస్తున్నట్లు ఈవోకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన వెంటనే ఈవో చర్యలు తీసుకున్నారు .
ఇదిలా ఉండగా.. టీటీడీ గతంలో మెట్టు నడక మార్గంలో భక్తులకు జారీ చేసే టోకెన్లను స్కానింగ్ చేసేది. కానీ పులుల దాడుల ఘటనల వల్ల ఆవిధానం ఆపేసింది. దీంతో చాలావరకు టోకెన్లు జారీ అనేది పక్కదారి పట్టిందని భక్తలు ఈవోకు ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలోనే.. శ్రీవారి దర్శనానికి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తుల టోకెన్లను స్కానింగ్ చేసే విధానం మరల స్టార్ట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగా.. గతంలో మాదిరిగానే 1200మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు (గురువారం) టీటీడీ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించినట్లు సమాచారం.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో ధర్మారెడ్డి టీటీడీ అధికారిగా ఉన్నప్పుడు భక్తులను ఎన్నో విధాలుగా ఇబ్బందిపెట్టారు. మెట్లమార్గంలో వచ్చేవారికి దివ్యదర్శనం టోకెన్లను నిలిపివేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభమయ్యింది