Tirumala Tirupati Devotees: భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన..!
తాజాగా ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో ధనుర్మాస ఏకాదశి రోజున స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడానికి టిటిడి వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ను జారీ చేయడానికి ఒక షెడ్యూల్ విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఐకపోతే తాజాగా టీటీడీ విడుదల చేసిన వైకుంఠ ద్వార దర్శన టికెట్ల తేదీలను మనం ఒకసారి గమనించినట్లయితే.. ఈనెల అనగా డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రూ.300. ప్రత్యేక దర్శన టికెట్ విడుదల చేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం.
ఇక తర్వాత జనవరి 8వ తేదీన ఆఫ్లైన్లో తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఏకాదశి పురస్కరించుకొని వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనానికి అనుమతులు కలిగించబోతున్నారు.
టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే ఈ దర్శనానికి అనుమతి లభిస్తుంది.ఇక టోకెన్లు లేని వ్యక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శన క్యూ లైన్ ల లోకి మాత్రం అనుమతించరు. గోవింద మాల భక్తులకు మాత్రం ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించకపోవడం గమనార్హం.
ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 4:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి.. ఇక అదే రోజు స్వామివారి దర్శనం కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రద్దీ కూడా అధికంగా ఉంటుందని ఆలోచించిన ఆలయ ప్రముఖులు ఆరోజు వేదశీర్వచనం రద్దు చేసినట్లు సమాచారం. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలనుకున్న భక్తులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.