Dry Tulsi leaves: తులసి మొక్క ఎండిన ఆకులతో కూడా అద్భుత ప్రయోజనాలు, ఎలా వాడాలో తెలుసుకోండి
తులసి ఎండిన ఆకుల్ని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడొక పాన్‌లో ఒక గ్లాసు నీళ్లను వేడి చేయాలి. ఆ తరువాత ఈ నీళ్లలో ఎండిన తులసి ఆకులు వేయాలి. వడకాచి తాగాలి. దీనివల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది.
తులసి మొక్క ఎండిన ఆకుల వినియోగం సలాడ్ లేదా పిజ్జా రూపంలో వాడితే మంచి రుచి ఉంటుంది. ఈ ఆకులతో సీజనింగ్ తయారు చేసుకుని వినియోగించవచ్చు.
ఇంట్లో ఎండిన తులసి ఆకులు పేరుకుపోతే..వాటన్నింటినీ కలిపి మిక్సీలో పౌడర్‌గా చేసుకోండి. వివిధ రకాల వంటల్లో కలుపుకుని వినియోగించవచ్చు.
తులసి ఆకులు ఎండిపోయాయి కదా అని పొరపాటున కూడా డస్ట్‌బిన్‌లో పాడేయవద్దు. ఎండిన ఆకులతో కూడా చాలా లాభాలున్నాయి. ఎండిన తులసి ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
తులసి మొక్క ఎండిన ఆకుల్ని ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఆకుల్ని చేత్తో క్రష్ చేసి మట్టి కలిపి మిక్స్ చేయాలి. అవసరమైన మొక్కలకు వినియోగిస్తే ఆ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.