Tulsi Vastu Precautions: తులసి మొక్కను ఆ రోజు ముట్టుకుంటే ఎంత కుబేరులైనా దరిద్రులవడం ఖాయం, జాగ్రత్త
తులసి మొక్కకు హిందూ మతంలో విశేష మహత్యం ఉంది. చాలా ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కను దేవతలకు ముఖ్యంగా లక్ష్మీదేవిగా నివాసంగా చెబుతారు. అందుకే అంతటి విశిష్ట ప్రాధాన్యత. తులసి మొక్క విషయంలో శుచి శుభ్రత పాటించాలంటారు.
తులసి మొక్కను ఎప్పుడు ఎలా పూజించాలి, ఎప్పుడు ఎలా పూజించకూడదనే సూచనలు ఉన్నాయి. తులసి మొక్కను ఎప్పుడు ముట్టుకోవచ్చు, ఎప్పుడు ముట్టుకోకూడదనే ఆంక్షలు కూడా ఉన్నాయి. వీటిని తూచా తప్పకుండా పాటించాలి.
తులసి మొక్క పూజించే విషయంలో నియమాలు పాటించకుంటే లక్ష్మీదేవి ఆగ్రహం ఎదురౌతుందంటారు. ఇళ్లు విడిచి వెళ్లిపోతుందని నమ్మకం. అందుకే తులసి మొక్కను పొరపాటున కూడా రాత్రి వేళ లేదా సూర్యాస్తమయం వేళ తాకకూడదు. లేకపోతే ఆర్ధికంగా నష్టాలు ఎదురౌతాయి
ఇక వారాల పరంగా చూస్తే ఆదివారం వేళ తులసి మొక్కను ముట్టుకోకూడదు. అంతేకాదు. ఆ రోజున తులసి మొక్కకు నీళ్లు కూడా పెట్టకూడదు.
ఎందుకంటే హిందూ వాస్తు ప్రకారం తులసి మాతను ఆశీర్వదించేందుకు ఆదివారం ఉపవాసముంటారంటారు. అందుకే తులసి మొక్కను నీరు పోయకూడదు. ఏకాదశి రోజున కూడా తులసి మొక్కను తాకకూడదు
తులసి మొక్క అనేది విష్ణువు కోసం నిర్వాసిత వ్రతం ఆచరిస్తుందని నమ్మకం. అందుకే ఆ రోజున అంటే ఏకాదశి రోజున తులసి మొక్కను తాకడం లేదా నీరు పోయడం చేయకూడదు. అలా చేస్తా ఎంతటి కుబేరులైనా దరిద్రులుగా మారిపోతారు.