TVS Jupiter CNG Price: రూ.90 వేలకే TVS జూపిటర్ CNG స్కూటర్.. ఒక్కసారి ఫిల్ చేస్తే.. 226 కి.మీ మైలేజీ!

TVS జూపిటర్ CNG స్కూటర్ మోస్ట్ పవర్‌ఫుల్ 124.8 cc ఇంజన్‌తో విడుదల కాబోతోంది. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే, మొట్ట మొదటి CNG-శక్తితో నడిచే స్కూటర్ అవుతుంది. దీని ఇంజన్ 9.4 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది పెట్రోల్‌తో పాటు CNGతో పాటు కూడా రన్ కానుంది.

ఈ స్కూటర్‌లో ఒక్కసారి CNG ఫుల్ చేస్తే దాదాపు 226 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన పెట్రోల్ ట్యాక్ కూడా లభిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80.5 కిలోమీటర్లకు చేరుకోగలుగుతుందని కంపెనీ తెలిపింది.
ఇక ఈ స్కూటర్ ఒక కీలో CNGతో గరిష్టంగా దాదాపు 84 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది సెమీ-డిజిటల్ స్పీడోమీటర్‌తో పాటు మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ఈ స్కూటర్‌కు సైడ్ స్టాండ్ ఇండికేటర్స్‌తో పాటు ఇన్హిబిటర్ ఇంజన్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్కూటర్ విడుదల తేదిని కంపెనీ త్వరలోనే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
TVS జూపిటర్ CNG స్కూటర్ మార్కెట్‌లోకి విడుదలైతే.. అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీని డిమాండ్ కూడా విపరీతంగా పెరగొచ్చు. ఇక ఈ స్కూటర్ లాంచ్ అయితే దీని ధర రూ.90,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆటో మొబైల్ మార్కెట్‌లో టాక్ నడుస్తోంది.