IPL 2020: నేటి నుంచి ఐపిఎల్ షురూ.. మెగా లీగ్ కు సర్వం సిద్ధం
కరోనావైరస్ వల్ల విసిగిపోయిన ప్రజలకు ఐపీఎల్ 2020 ఊరటనివ్వనుంది. వేలాది కోట్లు విలువ చేసే టోర్నిని బీసిసిఐ దేశంలో నిర్వహించలేకపోవడంతో దుబయిలో నిర్వహించాల్సి వస్తోంది. ఈ సారి దుబయిలోనే అన్ని మ్యాచులు జరగనుంది. నేటి నుంచి అరేబియా నుంచి అదిరిపోయే క్రికెట్ ను చూడవచ్చు.
యూఎఈ అధికారులు తమ వైపు నుంచి అన్నీ సిద్ధం అని ప్రకటించారు. అద్భుతమైన మెరుపులు, గ్రాండ్ స్టార్టింగ్ అన్నీ సిద్ధం అని తెలిపారు. మైదానాలు మెరిసిపోతాయి అంటున్నారు.
అయితే ప్రతీ ఏడాదిలా ఈ సారి మెగా ఈవెంట్ తో లీగ్ ప్రారంభం కాదు. ఇందులో చీర్ లీడర్స్ కూడా ఉండరు. ప్రేక్షకులకు కూడా ప్రవేశం లేదు.
గ్రాండ్ సెర్మనీ లేకుండా ఐపీఎల్ ప్రారంభం కావడం ఇది వరుసగా రెండోసారి. పుల్వామా దాడి తరువాత బీసిసిఐ సెర్మనీని గత ఏడాది రద్దు చేసింది. ఈ సారి కరోనావైరల్ వల్ల వేడుకలు ఉండబోవు.
ఈ సారి దుబయి, అబుధాబి, షార్జాలో మ్యాచులు జరుగుతాయి. ఇవాళ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.