UBI Recruitment 2024: యూనియన్ బ్యాంక్ బిగ్ నోటిఫికేషన్.. 1500 పోస్టుల భర్తీ పూర్తి వివరాలు తెలుసుకోండి..
యూనియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుంది. 1500 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇది కూడా ప్రొబేషనరీ ఆఫీసర్‌కు సమానం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి డిగ్రీ పొండి ఉండాలి.
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు ఇందులో రాతపరీక్ష, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
యూనియన్ బ్యాంక్ రెక్రూట్‌మెంట్ దరఖాస్తు చేసుకునే విధానం.. unionbankofindia.co.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
'రిక్రూట్‌మెంట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్' ఎంపిక చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ క్షుణ్నంగా చదవాలి.
నోటిఫికేషన్‌లో అడిగిన విధంగా డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయాలి. ముఖ్యగా ఫోటో, సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేయాలి. చివరకు ఒకసారి రివ్యూ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఫారమ్‌ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.