Aadhaar Card Photo Update: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా, ఇలా సులభంగా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకునేందుకు ఆన్‌లైన్ విధానంలో అవకాశం లేదు. సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. ఆధార్ కేంద్రంలో చాలా సులభంగా క్షణల్లో మీ ఫోటోను అప్‌డేట్ చేసుకోవచ్చు.
సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ అప్‌డేట్ ఫారమ్ ఫిల్ చేసి ఇవ్వాలి. దీనికోసం మీ పాస్‌పోర్ట్ ఫోటో తీసుకెళ్లాలి. బయోమెట్రిక్ వివరాలు వెరిఫై చేసుకున్నాక మీ ఫోటో అప్‌డేట్ చేస్తారు.
యూఐడీఏఐ అధికారిక పోర్టల్ uidai.gov.in ఓపెన్ చేసి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిని ఫిల్ చేసి సమీపంలోని ఆధార్ కేంద్రంలో ఇవ్వాలి. అక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు, ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ చేసి మీ ఫోటో లైవ్ తీసుకుంటారు. అదే ఫోటో పాత ఫోటోతో రీప్లేస్ అవుతుంది.
ఆధార్ ఫోటో అప్‌డేట్ చేసుకునేందుకు 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన వారం నుంచి పది రోజుల వ్యవధిలో మీ ఇంటికి కొత్త ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది. లేదా అప్ డేట్ అయినట్టు మీకు మెస్సేజ్ వస్తే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.