Latest Home Made Business Idea: సరికొత్త బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 10 వేల పెట్టుబడితో నెలకు రూ. 60 వేలు కళ్ళుమూసుకొని సంపాదించవచ్చు..

Mon, 27 Jan 2025-10:55 am,
How To Make Resin Jewelry For Beginners

 చాలా మందికి వారిదైన కలలు, ఆశయాలు ఉంటాయి. ఆ కలలను నెరవేర్చుకోవడానికి చిన్న వ్యాపారాలు ఒక గొప్ప వేదికలాగా మారాయి. ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల స్వంత బాస్‌గా మారవచ్చు.

Resin Crafts

మీ ఆలోచనలను, నైపుణ్యాలను ఉపయోగించి మీ స్వంత ఉత్పత్తులు లేదా సేవలను ప్రతిఒక్కరికి అందించవచ్చు. దీంతో పాటు కొంత  కష్టపడితే మీ వ్యాపారాన్ని విస్తరించుకొని, ఆర్థికంగా స్వతంత్రులు కావచ్చు.  

Resin Art

ప్రస్తుతం చాలామంది ఇంటి నుండే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆఫీసుకు వెళ్లడానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయి. ఇంటి పనులతో పాటు ఆఫీస్‌ వర్క్‌ కూడా చూసుకోవచ్చు. 

మీరు కూడా ఇంట్లో ఉంటూనే చిన్న బిజినెస్‌ చేయాలని అనుకుంటే ఈ రెసిన్‌ బిజినెస్‌ మీకు అద్భుతమైన వ్యాపారం. ఇది చాలా క్రియేటివ్‌గా ఉంటుంది. రెసిన్ ఉపయోగించి అనేక రకాల అందమైన వస్తువులు తయారు చేయవచ్చు.  

 రెసిన్‌ బిజినెస్ అంటే ఏమిటి? ఎలా ప్రారంభించాలి? మార్కెట్‌లో దీనికి డిమాండ్‌ ఉందా? అనే విషయాలు తెలుసుకుందాం. ఈ బిజినెస్‌ నచ్చితే మీరు కూడా ప్రారంభించండి.   

రెసిన్ అనేది ఒక రకమైన ద్రవ పదార్థం. దీనిని వివిధ రకాల పదార్థాలతో కలిపి అందమైన ఆర్ట్‌వర్క్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు తయారు చేస్తారు. ఈ ప్రక్రియను రెసిన్ ఆర్ట్ అంటారు.   

 రెసిన్ ఆర్ట్‌ ఒక వ్యాపారం మాత్రమే కాదు. ఇది ఒక క్రియేటివిటీ బిజినెస్‌. దీని ప్రారంభించడానికి అధిక పెట్టుబడి అవసరం లేదు. కొన్ని ముడిపదార్థాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.    

రెసిన్ ఆర్ట్‌ను ఇంటి నుంచే తయారు చేయవచ్చు.ఈ బిజినెస్ ఆదాయాన్ని పొందడానికి మంచి అవకాశం. ప్రస్తుతం రెసిన్ ఆర్ట్‌కు చాలా డిమాండ్ ఉంది.   

ఇంటి అలంకరణ, బహుమతులు, వివాహాలకు సంబంధించిన వస్తువులుగా రెసిన్ ఆర్ట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఈ బిజినెస్‌కు భారీ డిమాండ్ ఉంది.    

రెసిన్‌ బిజినెస్‌ ప్రారంభించడానికి ముందుగా వివిధ రకాల రెసిన్‌లు గురించి తెలుసుకోండి. మీరు ఏ రకమైన రెసిన్‌ బిజినెస్‌ చేయాలో అది ఎంచుకోండి. 

ఈ బిజినెస్‌లో రెసిన్‌ను పోసి వస్తువుల ఆకారాన్ని ఇచ్చేందుకు మోల్డ్‌లు అవసరం. రెసిన్‌ను కలపడానికి ప్లాస్టిక్ కప్పులు లేదా ఇతర కంటైనర్లు అవసరం.  

ఈ బిజెస్‌ కోసం మీరు కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ ఉత్పత్తలను అమ్మడం వల్ల నెలకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. మీరు కూడా ఈ వ్యాపారాన్ని ట్రై చేయండి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link