Upcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్ పై ఓ లుక్కేయండి
ఆటోమొబైల్ రంగంలో భారత్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఓ వైపు ఎలక్ట్రిక్ కార్ల సందడి..మరోవైపు టూవీలర్స్ హంగామా మామూలుగా లేదు. ఫోర్ వీలర్ తోపాటు టూవీలర్ కూడా అమ్మకాల్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది బైకులను ఇష్టపడుతుంటారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి కంపెనీలు. కస్టమర్లకు అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త ఫీచర్లు, సరసమైన ధరలకు బైకులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే దసరా పండగకు చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీరు బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకోసం సూపర్, డూపర్ బైకులు మార్కెట్లోకి రాబోతున్నాయి. వాటిలో లక్ష నుంచి మొదలుకుని 2 లక్షల వరకు ఉన్నాయి. మీ బడ్జెట్ కు సరిపోయే బైకును ఎంపిక చేసుకోవచ్చు. మరి ఆ బైకులు ఏవో చూసేద్దామా?
హీరో డెస్టిని( Hero Destini 125): ఈ బైక్ ఈ ఏడాది సెప్టెంబర్ లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్లో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఈ బైక్ యమహా రే జెడ్‌ఆర్ 125, టీవీఎస్ జూపిటర్ 125, హోండా యాక్టివా 125 వంటి బైకులకు గట్టిపోటీ ఇవ్వనుంది. ఈ బైక్ ధర రూ.83,000 నుంచి రూ.90,000 వరకు ఉండనుంది.
టీవీఎస్ రైడర్ 125 ఫ్లెక్స్-ఫ్యూయెల్(TVS Raider 125 Flex-Fuel)ఈ బైక్ ఈ ఏడాది అక్టోబర్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. మార్కెట్లో దీనికి హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్, హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్ టెక్ పోటీ ఇవ్వనున్నాయి. ధర రూ.1,00,000 నుంచి రూ.1,10,000 వరకు ఉండవచ్చు.
హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్-ఫ్యూయెల్ (Honda CB300F Flex-Fuel): ఈ బైక్ కూడా అక్టోబర్ లోనే లాంచ్ కానుంది. హీరో కరిజ్మా , రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 42 ఎఫ్‌జే పోటీని ఇస్తాయి. . ధర రూ.1,90,000 నుంచి రూ.2 లక్షల ఉండే ఛాన్స్ ఉంది.
బజాజ్ పల్సర్ ఎన్125 ( Bajaj Pulsar N125) : ఈ ఏడాది అక్టోబర్ లో లాంచ్ కానుంది. హీరో గ్లామర్ ఎక్స్‌టెక్, ఓలా రోడ్‌స్టర్, బజాజ్ ఫ్రీడమ్ నుంచి పోటీ తప్పదు. ధర రూ.90,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది.
కేటీఎం 125 డ్యూక్ ( KTM 125 Duke): ఈ బైక్ ఈ ఏడాది అక్టోబర్ లో లాంచ్ కానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, బజాజ్ డొమినార్ 250, ఒడిస్సే వాడర్ పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ధర రూ.1,75,000 నుంచి రూ.1,80,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది.