Upendra UI Leaked: ఉపేంద్ర UI మూవీకి కొత్త చిక్కులు.. విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్లోకి..!
సాధారణంగా ఒక సినిమాని తెరకెక్కించేటప్పుడు దర్శక నిర్మాతలు, హీరోలు, చిత్ర బృందం చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించి.. ఏ చిన్న అప్డేట్ కూడా బయటకి లీక్ కాకుండా అధికారికంగా ప్రకటించే వరకు ఆడియన్స్ ఎదురుచూసేలా చేస్తూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు..అనుకోని కారణాల చేత లేదా ఇతర వ్యక్తుల కారణంగా లీక్ అవుతూ ఉంటాయి. సినిమా నుంచి చిన్న చిన్న ఫోటోలు, సన్నివేశాలు లీకైతే పర్వాలేదు.. కానీ భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య విడుదల చేసిన సినిమా కొన్ని గంటల్లోనే మొత్తం ఆన్లైన్ లోకి వచ్చేస్తే ఆ నిర్మాతలు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు
సరిగ్గా ఉపేంద్ర UI సినిమా కూడా ఇప్పుడు అలాంటి సమస్యను ఎదుర్కొంటుంది.. కన్నడ సినీ ప్రేక్షకులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన చిత్రం యు.ఐ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు బోర్ కొట్టింది. కానీ కొత్తదనం కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా పర్వాలేదు అని అనిపించవచ్చు.
ఇక తాజాగా నిన్న అనగా డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా , అలా థియేటర్లో విడుదలైందో లేదో ఇలా ఆన్లైన్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఎవరి తప్పిదమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమా మొత్తం ఆన్లైన్ లో వచ్చేసరికి అటు అభిమానులు సైతం ఖంగుతిన్నారు.
ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ యు ఐ పైరసీ వెబ్సైట్స్ అయిన Movierulez, Tamilrockerz, Filmyzilla, ఐ బొమ్మ, మూవీస్డా, తమిళయోగి, తమిళ బ్లాస్టర్స్ తో పాటు మరికొన్ని టెలిగ్రామ్ ఛానల్ లలో సహా పలు వెబ్సైట్లో ఈ చిత్రం ఉచితంగా లభిస్తోంది ముఖ్యంగా 1080P, 720p, 480 p, 360 p, 240 p అలాగే హెచ్డీ వెర్షన్ల వంటి వివిధ రిజల్యూషన్లలో ఈ సినిమాని ఆన్లైన్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పైరసీ వెబ్సైట్స్ అవకాశం కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి దీనిపై యుఐ సినిమా నిర్మాతలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జీ మనోహరన్, కెపి శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రానికి ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఉపేంద్ర, రేష్మ నానయ్య, సన్నీ లియోన్, సాధు కోకిల తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక డిసెంబర్ 20వ తేదీన తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయడం జరిగింది.