UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

Thu, 29 Aug 2024-12:07 pm,

23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో ఓ ఉద్యోగి తన చివరి 12 నెలలు పొందిన జీతంలోని బేసిక్‌ పే సగటులో 50 శాతాన్ని నెలనెలా పెన్షన్‌గా పొందుతారు. ఏప్రిల్‌ 1, 2025 నుంచి యూపీఎస్‌ అమలు చేయనుంది.  

ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో ఉన్న ఉద్యోగులు, రిటైర్‌మెంట్ అయినవారు యూపీఎస్‌లో చేరవచ్చు. అయితే యూపీఎస్‌లో కచ్చితంగా చేరాలనే నిబంధన ఏమీ లేదు.  

యూపీఎస్‌ అనేది ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ని మెరుగుపరిచే ప్రయత్నమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. యూపీఎస్ కింద గ్యారంటీ పెన్షన్ ఉంటుందన్నారు.  

అయితే ఎన్‌పీఎస్‌పై ఎలాంటి యూటర్న్ తీసుకునే ప్రసక్తి లేదన్నారు. అయితే ఎన్‌పీఎస్‌ కంటే యూపీఎస్‌ ఎంతో బాగుంటుందన్నారు. ఈ స్కీమ్‌తో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదన్నారు.   

యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.   

ఓపీఎస్ స్థానంలో కేంద్రం ఎన్‌పీఎస్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ను జనవరి 1, 2004 నుంచి అమలులోకి తీసుకువచ్చింది.  

అయితే ఈ స్కీమ్‌లో గ్యారంటీ పెన్షన్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను తీసుకువచ్చింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link