Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..
పూజా ఖేద్కర్ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఈ అధికారిణి పూణెలో ట్రైనింగ్ లో ఉండగా.. తనకు అదనపు సౌకర్యాలు కావాలని అక్కడి కలెక్టర్ తో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా.. కలెక్టర్ లేనప్పుడు ఆయన గదిలోని ఫర్నీచర్ ను తన రూమ్ లోకి షిప్ట్ చేసుకుంది.
దీంతో ఈ వివాదం కాస్త వెలుగులోకి వచ్చింది. స్థానిక కలెక్టర్ మహరాష్ట్ర సర్కార్ కు ఫిర్యాదుచేశారు. దీంతో పూజా పై విచారణ ప్రారంభమైంది. అంతేకాకుండా.. ఆమె సివిల్స్ ఎక్జామ్ లలో అన్ని ఫెక్ సర్టిఫికేట్ లు సబ్మిట్ చేసినట్లు బైటపడింది.
ట్రైనీ ఐఏఎస్ గా ఉన్నప్పుడు, ఒక దొంగతనం కేసులో డీఎస్పీకి ఒత్తిడి తీసుకొచ్చిందంట. పూణేలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టగా.. ఇటీవల అధికారులు దాన్ని కూలగొట్టారు
పూజా ఖేద్కర్ తండ్రి గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఆయన కూడా అధికారిగా ఉన్నప్పుడు పలు అక్రమాలు చేసిన ఘటనలు బైటపడ్డాయి. పూజా ఖేడ్కర్ తల్లి ఏకంగా గన్ పట్టుకుని భూమి విషయంలో అమాయకులను బెదిరింపులకు గురిచేంది. ఓబీసీ, దివ్యాంగులకు చెందిన అనేక నకిలీ సర్టిఫికేట్ లను పూజా ఖేడ్కర్ యూపీఎస్సీకి సమర్పించింది. అవన్ని నకిలీవని తెలింది.
పూజా ఇప్పటిదాక.. నకిలీ ఓబీసీ, వికలాంగ కోటా కింద.. పదిహేనుకంటే ఎక్కువ సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ ను రాసినట్లు తెలుస్తోంది. సర్టిఫికేట్ లన్నింటిలో నకిలీ అడ్రస్, తల్లిదండ్రుల పేర్లను రాసినట్లు బైటపడింది. దీంతో యూపీఎస్సీ అధికారులు ఆమెపై విచారణకు ఏక సభ్య కమిషన్ ను నియమించింది. చీటింగ్ చేసినందుకు గాను.. యూపీఎస్సీ పూజా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా, యూపీఎస్సీ ఏకసభ్య కమిషన్ పూజాపై విచారణ జరిపి సమగ్ర నివేదికను ఇచ్చింది. అదే విధంగా.. గతంలో యూపీఎస్సీ పూజాకు నోటీసులు జారీచేసింది. ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని తెల్చిచెప్పింది.
ఆమెకు జులై 25 న డెడ్ లైన్ ఇచ్చారు. కానీ పూజ మాత్రం ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరిందంట. కానీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక పోవడంతో అధికారులు జులై 30 వరకు వేచి చూశారు. ఈ క్రమంలో యూపీఎస్సీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పూజా ఖేడ్కర్ ను యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్ చేస్తున్నట్లు యూపీఎస్పీ ప్రకటించింది.
భవిష్యత్తులో ఆమె ఎలాంటి ఎగ్జామ్ లు రాయడానికి అవకాశం ఉండదంటూ కమిషన్ తెల్చిచెప్పింది. మరోవైపు.. చీటింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 1 న న్యాయస్థానం దీనిపై తీర్పును వెలువరించనుంది.