Best Yogasanams: యూరిక్ యాసిడ్ నొప్పుల్ని సులభంగా దూరం చేసే 5 యోగాసనాలు
విపరీత కరణి
విపరీత కరణి చాలా సరళమైన, విశ్రాంతికరమైంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ ఆసనం వేసేందుకు గోడకు కాళ్లు ఆన్చి పైకి లేపాలి. శరీరాన్ని ఫ్రీగా ఉంచాలి. ఈ ఆసనం వేస్తుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం అందుతుంది.
అర్ధ మత్స్యేంద్రాసనం
ఇదొక ట్విస్టింగ్ ఆసనం. వెన్నుముక, కడుపు అంగాల్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో కీళ్లకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాళ్లను మోకాళ్ల వరకు మడిచి రెండే కాలిపై ఉంచాలి. శరీరాన్ని ఓ వైపుకు టర్న్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది
భుజంగాసనం
ఈ ఆసనం చాలా ప్రభావవంతమైంది. కడుపు అంగాలు బలోపేతం అవుతాయి. ఈ ఆసనం ప్రత్యేకంగా మోకాళ్లు, వీపు నొప్పిని తగ్గించవచ్చు. భుజంగాసనంతో కడుపుపై పడుకుని రెండు చేతుల్ని భుజాలపై ఆన్చి మీ శరీరం ముందు భాగాన్ని పైకి లేపాలి
పశ్చిమోత్తాసనం
పశ్చిమోత్తాసనం అనేది స్ట్రెచింగ్ కలిగిస్తుంది. శరీరాన్ని స్ట్రెచ్ చేయడంతో పాటు నొప్పులుంటే తగ్గిస్తుంది. కాళ్లను ముందుకు చాపుకుని కూర్చోవాలి. ఆ తరువాత చేతులతో కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించాలి. ఫలితంగా వెన్నుముక స్ట్రెచ్ అవుతుంది.
సుఖాసనం
సుఖాసనం అనేది చాలా సులభంగా వేయగలిగే ఆసనం. మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతిని ఈ ఆసనం పెంచుతుంది. ఈ ఆసనం ద్వారా శరీరం దిగువ భాగంలో ముఖ్యంగా మోకాళ్లు, మడమ నొప్పిని తగ్గిస్తుంది. రెండు కాళ్లను క్రాస్ చేసి ఫ్రీగా కూర్చోవాలి. చేతుల్ని మోకాళ్లపై ఆన్చాలి. శ్వాస తీసుకుని వదులుతుండాలి