Tech Tips: 5జీ నెట్ వర్క్ ఉన్నప్పటికీ నెట్ స్లోగా ఉందా.. ఈ టిప్స్ పటిస్తే రాకెట్ స్పీడ్ పక్కా
5G Network Speed : స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌లు నేడు ప్రజల ప్రాథమిక అవసరాలుగా మారాయి. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా.. మన పనులు చాలా వరకు ఆగిపోతాయి. చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ స్పీడ్‌తో సమస్యలను ఎదుర్కొంటారు. 5G యుగంలో కూడా, ఫోన్‌లలో స్లో డేటా స్పీడ్ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని ఉండి, డేటా స్పీడ్ స్లో అయితే మూడ్ మొత్తం చెడిపోతుంది. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కుంటే..మీ నెట్ స్పీడ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
ఏ పని చేయాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్..అందులో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా హై స్పీడ్ కనెక్టివిటీ చాలా ముఖ్యమైనది. ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ పెరుగుతున్న క్రేజ్ కారణంగా, ప్రజలు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది హై స్పీడ్ డేటా కోసం మాత్రమే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వైపు మళ్లుతున్నారు. మీరు రోజువారీ డేటా లిమీట్ లోపు మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తుంటే.. మీరు స్లో స్పీడ్‌ని పొందుతున్నట్లయితే, ఈ టిప్స్ మీ కోసం. వీటిని పాటిస్తే స్లో డేటా కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
నెట్‌వర్క్ మోడ్‌ని మార్చండి: చాలా సార్లు, సరైన నెట్‌వర్క్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోకపోవడం వల్ల ఫోన్‌లోని ఇంటర్నెట్ డేటా వేగం స్లో అవుతుంది. అందువల్ల, మీరు మీ ఫోన్‌లో సరైన నెట్‌వర్క్ స్పీడ్ పొందకపోతే, అది నెట్‌వర్క్ మోడ్‌తో సమస్య కావచ్చు. మీరు దాన్ని కచ్చితంగా చెక్ చేసుకోవాలి.
నెట్‌వర్క్ మోడ్‌ను సరిచేయడానికి, మీరు సెట్టింగ్‌లకు వెళ్లి మొబైల్ నెట్‌వర్క్ ఆప్షన్ లోకి వెళ్లాలి. అక్కడ సిమ్ కార్డ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన నెట్ వర్క్ ఎంచుకుని నెట్ వర్క్ మోడ్ లోకి వెళ్లాలి. ఇప్పుడు LTE/5G/4G ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్లో చాలాయాప్స్ ఓపెన్ చేసి ఉంటే కూదా డేటా స్పీడ్ స్లో గా ఉంటుంది. మీకు హైస్పీడ్ డేటా కావాలంటే బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను డిసేబుల్ చేసుకోవాలి.
మీకు తెలియకుండానే లొకేషన్ ఆన్‌లో ఉన్నప్పుడు Google మ్యాప్ డేటాను మింగేస్తుంది. మనం యాప్‌ని ఓపెన్ చేయలేదు కదా ఏం కాదనుకుంటారు చాలా మంది. కానీ లొకేషన్ ఆన్ చేసి ఉంచితే నిరంతరం డేటాను వాడేస్తుంది. మీరు స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి లొకేషన్‌ను ఆఫ్ చేయాలి. మీరు ఫోన్‌లో కనిపించే టోగుల్‌ను క్రిందికి లాగడం ద్వారా లొకేషన్ ఆప్షన్ ఆఫ్ చేసుకోవచ్చు.
సాఫ్ట్ వేర్ అప్ డేట్ చాలా మంది స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయరు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేకపోవడం వల్ల, డేటా స్పీడ్ తగ్గుతుంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేట్‌ను తీసుకొచ్చినప్పుడల్లా, ఫోన్,యాప్‌లలో ఉన్న బగ్‌లు, నెట్‌వర్క్ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మీరు మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను, మీ ఫోన్‌లో ఉన్న యాప్‌లను అప్‌డేట్ చేయకుంటే, మీరు దాన్ని వెంటనే అప్‌డేట్ చేయాలి. మీరు Google Play Storeలోకి వెళ్లి మీ ఫోన్‌లో అప్‌డేట్ చేయని అప్లికేషన్‌లను గుర్తించి వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలి.