Yogi Adityanath Delhi Visit: యూపీలో విజయం అనంతరం యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ సుడిగాలి పర్యటన దృశ్యాలు

దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింహ్‌ను..యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కలుసుకున్నారు. యూపి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను యోగీ ఆదిత్యనాధ్ కలుసుకున్నారు. యూపీలో బీజేపీ ఘన విజయంపై అమిత్ షా..శుభాకాంక్షలు తెలిపారు.

యోగీ..ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. పార్టీ విజయం పట్ల జేపీ నడ్డా..యోగీకు శుభాకాంక్షలు అందించారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. యూపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు మోదీ..యోగీకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఐదేళ్లలో యూపీ అభివృద్ధిని మరింత శిఖరాలకు చేరుస్తారని మోదీ ఆకాంక్షించారు.
యోగీ ఆదిత్యనాధ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలుసుకున్నారు. బీజేపీ విజయం అనంతరం ఢిల్లీలో కీలక నేతల్ని కలిశారు.