Vaikuntha Ekadashi 2025: తెలంగాణలో భద్రాచలం, యాదాద్రి సహా ఘనంగా ఉత్తర ద్వార దర్శనం జరిపే వైష్ణవ దేవాలయాలు ఇవే..
భద్రాచలం..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు. తెల్లవారుఝామున చేసుకునే ఉత్తర ద్వార దర్శనంతో అన్ని పాపాలు పటాపంచలైపోతాయి అని చెబుతుంటారు. ఇక తెలంగాణలో ఉత్తర ద్వార దర్శనం జరుపుకునే దేవాలయాల్లో ‘భధ్రాచలం’ ఒకటి. ఇక రాములోరని ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం గుండా కనులారా వీక్షించవచ్చు.
యాదాద్రి - యాదగిరి గుట్ట.. యాదాద్రి లేదా యాదగిరి గుట్టలో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహా స్వామి తెలంగాణలో వైష్ణవ ఆలయాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ కొలువైన నరసింహ స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రశస్తి. ఇక్కడ వైకుంఠ ఏకాదశిన దర్శించుకుంటే పుణ్యప్రదంగా భావిస్తుంటారు.
ధర్మపురి..
ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఉత్తర ద్వార దర్శనంతో తమ జన్మ ధన్యమైనదిగా భావిస్తుంటారు.
అమ్మపల్లి..
అమ్మపల్లిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి కూడా చారిత్రక ప్రాశస్తమైనది. హైదరాబాద్ శివారులో శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఈ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం సర్వ పాప హరణంగా భావిస్తుంటారు.
మఠంపల్లి..
మఠంపల్లిలో కొలువైన శ్రీలక్ష్మి నరసింహ స్వామి శ్రీ రాజ్యలక్ష్మి చెంచు లక్ష్మి సమేత శ్రీ పహ్లాద యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహా స్వామిగా కొలువైన భక్తుల కొంగు బంగారంగా కొలువైరు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు.
చిలుకూరి బాలాజీ టెంపుల్..
భాగ్య నగరం శివారులో కొలువైన చిలుకూరి బాలాజీ స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడ భక్తులను కోరికలు తీర్చడంలో ముఖ్యంగా ఇక్కడ దేవ దేవుడిని వీసా వేంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. అటు బడంగ్ పేటలో కొలువైన కాశీ బుగ్గ దేవాలయంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా స్వయంభూగా చెబుతుంటారు.
స్వర్ణగిరి.. కొత్తగా కట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చారిత్రక ప్రాశస్త్యం లేకపోయినా.. యాదాద్రిని దర్శించుకునే భక్తులు ఇక్కడ కొలువైన స్వామిని దర్శించుకుంటూ ఉంటారు.