Vaikuntha Ekadashi 2025: హైదరాబాద్ లో ఉత్తర ద్వార దర్శనం జరిపే ప్రముఖ వైష్ణవ దేవాలయాలు ఇవే..
ఈ రోజు సాక్షాత్తు ముక్కోటి దేవతలు ఆ దేవ దేవుడి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్లి ఆ దేవ దేవుడి దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మనం చేసిన పాపాలన్ని పటాపంచలైపోతాయనేది పురాణ కథనం.
దీంతో పరమ పవిత్రమైన ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కోటి జన్మల ఫలం దక్కుతుందనేది పెద్దలు చెబుతుంటారు. హైదరాబాద్ లో జియా గూడాలో కొలువైన రంగనాథ స్వామి ఆలయం ఎంతో పురాణ ప్రాశ్యస్తమైనది. ముందుగా ఈ ఏరియా పేరు జియర్ గూడా నుంచి జియా గూడాగా కాలనుక్రమంలో పేరు మారింది.
చిలుకూరి బాలాజీ దేవాలంలో కూడా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి వీసా వేంకటేశ్వర స్వామిగా పేరుంది. అక్కడ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేది ప్రతీతి.
హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగా బిర్లా వాళ్లు కట్టించిన దేవాలయంలో వేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. దీన్ని నవద్ పహాద్ అని కూడా పిలుస్తారు. అటు చిక్కడపల్లిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి కూడా చారిత్రక ప్రాశస్త్యమైనది.
అటు పాత బస్తీలో పలు వైష్ణవ ఆలయాలున్నాయి. చాంద్రాయణ గుట్టలో కొలువైన చెన్నకేశవ స్వామి ఆలయం.. అక్కడ బీడీఎల్ పక్కన శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి.. అలాగే లాల్ దర్వాజలోని పూల్ బాగ్ వేంకటేశ్వర స్వామి..గౌలిపురాతో పాటు వట్టేపల్లిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, దూద్ బౌలిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎంతో చారిత్రక ప్రాశస్త్యమైనవి.ఇక్కడ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.
సీతారామ్ బాగ్ లో కొలువైన సీతారామ స్వామి గుడితో పాటు హిమాయత్ నగర్ లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామితో పాటు జూబ్లిహిల్స్ లో కొత్తగా కొలువు దీరిన టీటీడీ వారి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంతో పాటు పూరీ జగన్నాథ స్వామి ఆలయం సహా పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.