Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ.. మీ బంధు మిత్రులకు వాట్సాప్ మెస్సెజ్‌లు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

Thu, 09 Jan 2025-11:10 pm,

వైకుంఠ ఏకాదశిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తాయని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈసారి మనం  జనవరి 10 శుక్రవారం రోజున ముక్కొటి ఏకాదశి జరుపుకోబోతున్నాం. ఈరోజున స్వామి వారిని ముఖ్యంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొవాలని పండితులు చెబుతుంటారు.  

అయితే.. ముక్కోటి ఏకాదశి నుంచి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమౌతుంది. ఈ కాలంలో చేసే పూజలు, వ్రతాలు, జపాలు కూడా వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాయంటారు. ఉత్తరాయణం అనేది దేవతలకు పగలు అని చెబుతుంటారు.

అందుకే మహాభారతంలో భీష్ముడు..  ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యే వరకు కూడా అంపశయ్యపై పడుకుని ఉండి.. ఆ తర్వాత మోక్షంను పొందుతారు. అందుకు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్లి ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటే.. మోక్షంతో పాటు.. ఎవరి మనస్సులో ఏంకొరుకున్న అది నెరవేరుతుందని పండితులు చెబుతుంటారు.

అలాంటి పవిత్రమైర వైకుంఠ ఏకాదశి రోజున మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలను వాట్సాప్ లు, మెస్సెజ్ లు, ఫోటోలు రూపంలో పంపి వారికి ఆ నారాయణుడి అనుగ్రహం కలగాలని కోరుకుందాం.

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో.. మీకు, మీ కుటుంబ సభ్యులు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. జై శ్రీమన్నారాయణ.. జై శ్రీమన్నారయణ.. అని ఇలా వాట్సాప్ సందేశాలను చాలా మంది ఇటీవల ఒకరికి మరోకరు పంపుకుంటారు.  

అదే విధంగా కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఆ శ్రీమన్నారయణుడ్ని భావిస్తారు. అలాంటి నారాయణుడు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడు ఉండాలని.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు పంపి మన వాళ్లకు ఆనందం కలిగేలా చేయోచ్చు.

ముక్కోటి ఏకాదశి వేళ.. మూడు కోట్ల దేవతల అనుగ్రహాంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయం సాధించాలని, ఆదేవుడి అనుగ్రహంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అని పంపి మనవాళ్లకు మంచి జరగాలని కోరుకోవచ్చు.  

వైకుంఠ ఏకాదశిని పండుగను పురస్కరించుకుని మీరు చేసే ప్రతి పనిలోను ఆ నారాయణుడు తోడుగా ఉండి.. మీకు అన్నిపనుల్లో విజయాలను అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ముక్కొటి ఏకాదశి శుభాకాంక్షలు అంటు మీ వాళ్లకు శుభాకాంక్షల మెస్సెజ్, ఆ దేవుడి ఫోటోలను పంపవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link