Vasantha Panchami Muggulu 2024: వసంత పంచమి రోజు తప్పకుండా ఇంటి ముందు వేసుకోవాల్సిన ముగ్గుల డిజైన్స్ ఇవే..
వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన వచ్చింది. ఈ పంచమి రోజున సరస్వతీ అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఈ పండగ మాఘమాసంలోని శుక్లపక్షంలో 5వ తేదీనాడు జరుపుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా ఈ వసంత పంచమి పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ పండగను జరుపుకునే వారు తప్పకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. దీంతోపాటు ఈ పంచమి రోజు సాక్షాత్తు సరస్వతి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వసంత పంచమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఇంటి ముందు కొన్ని తప్పకుండా ముగ్గులను పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఇంటిని పూలతో అందంగా అలంకరించుకోవడం వల్ల కూడా పిల్లలకు జ్ఞానం లభిస్తుందని ఒక నమ్మకం.
వసంత పంచమి సందర్భంగా మీ ఇంటి ముందు మంచి ముగ్గును వేయాలనుకుంటున్నారా? అయితే ఈ రంగోలి డిజైన్స్ మీకోసమే.. సులభమైన ఈ ముగ్గుల డిజైన్తో మీ వాకిలి మొత్తం పరిచేయండి.
సరస్వతి అమ్మవారును పూజించే సమయంలో తప్పకుండా అమ్మవారి పెట్టుకునేవారు రంగోలిని వేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇంట్లో ఉండే చిన్న గుడిలో రెండు చుక్కలు లేదా మూడు చుక్కల ముగ్గుని వేయండి.
వసంత పంచమి రోజు కలర్ కలర్ రంగులతో ముగ్గులను వేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం. కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వీణా ముగ్గురు వేయండి.
సరస్వతి దేవికి వీణతో పాటు హంస అంటే ఎంతో ఇష్టం. కాబట్టి వసంత పంచమి రోజున ఈ రెండు కలిగిన ముగ్గులను వేయడం వల్ల ఎంతో శుభప్రదం..
వసంత పంచమి ముగ్గులు భాగంగా ఈ డిజైన్ ను కూడా వేయవచ్చు. ఈ డిజైన్ చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వెయ్యడం కూడా చాలా సులభం.