Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!

Tue, 01 Dec 2020-5:21 pm,

వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ సమస్య తీరనుంది. ఇకనుంచి ఆర్‌సీ రూల్స్‌లో కొత్త సవరణలు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో నామినీ పేరు ఇవ్వాలి. లేకపోతే కొన్ని రోజుల తరువాత అయినా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత వెహికల్ ఓనర్ చనిపోతే.. నామినీ పేరు పైకి వాహన యాజమాన్య హక్కులు బదిలీ చేస్తారు.

ప్రైవేట్ ట్యాక్సీలకు కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ సంస్థల పీక్ అవర్స్‌గా పేర్కొనే సమయాలలో తమకు నచ్చినతీరుగా ధరలను పెంచుకునే అవకాశం ఏ మాత్రం ఉండదు.

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ రూల్ రానుంది. వీరు బీఐఎస్ సర్టిఫై చేసిన హెల్మెట్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. నాణ్యత లేని నాసిరకం హెల్మెట్లకు ఇక కాలం చెల్లనుంది. నాసిరకం హెల్మెట్ ధరించినా ప్రాణాలు పోతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తున్నారు. అవి అమలులోకి వస్తే వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పీయూసీ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ సర్టిఫికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ స్కాన్ చేస్తే వాహనం, ఓనర్ ఇతరత్ర వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read : Best Unlimited Prepaid Plans Under Rs 500: బెస్ట్ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్.. వివరాలు ఇవే

గతంలో కస్టమర్స్ క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత క్యాబ్ డ్రైవర్స్ కొన్నిసార్లు రైడ్‌ను క్యాన్సల్ చేసేవారు. కొత్త నియమాలు అమలులోకి వస్తే.. డ్రైవర్ మీ రైడ్ రద్దు చేస్తే 10శాతం రైడ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ల షిఫ్ట్ 12 గంటలకు పరిమితం కానుంది. కొత్త నియమాలతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read : Nominee For Motor Vehicles: వాహనదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link