Venkatesh Vs Prabhas: వెంకటేష్ ఫ్లాప్ సినిమాతో ప్రభాస్ హిట్ అందుకున్న ఈ సినిమా తెలుసా..

Wed, 31 Jul 2024-8:50 am,

Venkatesh - Prabhas: అవును ఒకే కథతో వెంకటేష్ ఫ్లాప్ అందుకుంటే.. ప్రభాస్ మాత్రం బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అవును చిత్ర సీమలో ఒకే తరహా కథలతో సినిమాలు తెరకెక్కడం మాములే.

ఈ కోవలో వెంకటేష్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘టూటౌన్ రౌడీ’ అనే సినిమా చేసాడు. ఈ సినిమా హిందీలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తేజాబ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.

కానీ టూటౌన్ రౌడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్టాప్ గా  నిలిచింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరో ముఖ్యపాత్రలో నటించడం విశేషం.

చాలా యేళ్ల తర్వాత ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వర్షం’. ఈ సినిమా కథ కూడా దాదాపు టూటౌన్ రౌడీ సినిమా కథనే పోలీ ఉంటుంది.

ఈ రెండు సినిమాల మూల కథనే ఒకటే అయినా.. ట్రీట్ మెంట్ మాత్రం వేరుగా ఉంటుంది. అప్పట్లో వెంకటేష్.. ‘టూటౌన్ రౌడీ’ కథతో ఫ్లాప్ అందుకుంటే.. ఆ స్టోరీతోనే ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకోవడం విశేషం.

తెలుగులో ప్రభాస్ హీరోగా హిట్టైన ‘వర్షం’ సినిమాను మళ్లీ హిందీలో టైగర్ ఫ్రాఫ్ హీరోగా ‘బాఘీ’ టైటిల్ తో రీమేక్ చేసారు. బాఘీ అంటే రెబల్ అని అర్ధం. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link