Venus Mercury Conjunction: 5 రోజుల్లో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్, ఊహించని సంపద
బుధ గ్రహం గోచారం
జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ 10వ తేదీ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బుధుడు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని రాజకుమారుడిగా, బుద్ధి, తెలివితేటలు, మిత్రత్వానికి ప్రతీకగా భావిస్తారు.
సింహ రాశి
తులా రాశిలో ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ యోగం సింహ రాశి జాతకులకు మహర్దశగా మారనుంది. అన్ని రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది.
వృషభ రాశి
బుధ, శుక్ర గ్రహాల యుతి కారణంగా వృషభ రాశి జాతకులకు అక్టోబర్ 13 నుంటి పట్టిందల్లా బంగారం కానుంది. అంటే గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. రావనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు అనువైన సమయం.
మేష రాశి
తులా రాశిలో బుధ, శుక్ర గ్రహాల యుతితో ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ యోగం మేష రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ రాశి జాతకులు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. కెరీర్ సంబంధిత అంశాల్లో విద్యార్ధులకు మంచి రోజులు. కొత్త వ్యాపారాలు ప్రారంభించనున్నారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
లక్ష్మీ నారాయణ యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 13వ తేదీ శుక్రుడు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. అంటే బుధ, శుక్ర గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. ఫలితంగా అత్యంత అరుదుగా భావించే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. ఇది కచ్చితంగా 3 రాశులకు ఊహించని సంపదను తెచ్చిపెట్టనుంది. ఈ మూడు రాశులపై కనకవర్షం కురిపించనుంది