Venus Transit 2024: శుక్ర సంచారం.. మరో రెండు రోజుల్లో ఈ 4 రాశులకు 1000 రెట్ల రాజయోగం..!

Fri, 23 Aug 2024-10:16 am,

శుక్రుడు అంటేనే సుఖాలకు కారణం. ఈ శుక్రుని సంచారం ఆగస్టు 25న ఆదివారం కన్యారాశిలో  జరగనుంది. సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 02:04 వరకు కన్యారాశిలో ఉండనున్నాడు. ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి వచ్చే రాశులు ఏంటో తెలుసుకుందాం..    

వృషభం: కన్యారాశిలో శుక్రుని సంచారం కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పనిప్రదేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూల ఫలితాలు రావచ్చు. వృషభ రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. .  

కర్కాటకం: కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా కూడా లాభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు వర్క్‌ ప్లేస్‌లో ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా కూడా బలపడతారు. కర్కాటక రాశివారు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఈ శుక్ర సంచారం వల్ల కుటుంబం ,వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మొత్తానికి అనుకూల ఫలితాలు తెస్తుంది.   

కన్య: కన్యా రాశిలో శుక్రుని సంచారం కన్యా రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వీరు పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు. వీరి వైవాహిక జీవితంలో సఖ్యత మరింత పెరుగుతుంది. కన్యా వ్యాపారస్తులకు శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో ఏళ్లుగా పెళ్లికాని వారికి ఈ సమయంలో పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది.  

వృశ్చికం: వృశ్చిక రాశివారికి కూడా కుటుంబ, సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ శుక్రుని సంచారం ఆర్థికంగా లాభాలను తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో వీరు డబ్బు తోపాటు విజయం కూడా సంపాదిస్తారు. వృశ్చిక రాశివారికి ఈ శుక్ర సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  

జీవితంలో ఎప్పుడైనా శుక్ర యోగం పొందడానికి ఓం అచ్వద్వజాయ విద్మహే.. తనుర్ హస్తాయ ధీమహి.. తన్నో శుక్రప్రయోదయాత్ అనే శుక్ర గాయత్రీ మంత్రాన్ని పఠించండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link