Venus Transit 2023: మరి కొద్దిగంటల్లో ఆ 5 రాశులకు తిరగనున్న దశ, ఊహించని లాభాలు, పదవులు

Sun, 12 Mar 2023-7:59 am,
Venus transit in aries 2023 shukra gochar effect on these 5 zodiac signs

ధనస్సు రాశి

ఈ రాశి పంచమ పాదంలో శుక్రుడి గోచారం వల్ల ఈ రాశి జాతకులకు మంచి పరిణామాలు ఎదురౌతాయి. పెళ్లైనవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఎప్పట్నించో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సమస్యలు దూరమౌతాయి. డబ్బులు సంపాదించేందుకు అనువైన సమయం

Venus transit in aries 2023 shukra gochar effect on these 5 zodiac signs

మీన రాశి

జ్యోతిష్యం ప్రకారం మీన రాశి జాతకుల ద్వితీయ పాదంలో గోచారం ఉంటుంది. ఫలితంగా ఈ జాతకులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అత్తారింటి తరపున సంబంధాలు మెరుగుపడతాయి. పనిచేసేచోట మెరుగైన పరిస్థితులు కన్పిస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవల్సి వస్తుంది. ఆ ఖర్చుల్ని సేవింగ్స్‌పై కేంద్రీకరించాలి.

Venus transit in aries 2023 shukra gochar effect on these 5 zodiac signs

సింహ రాశి

జ్యోతిష్యం ప్రకారం శుక్రుడి గోచారం సింహ రాశి నవమ పాదంలో ఉంటుంది. ఇందులో ముందు నుంచే రాహువు ఉండటంతో శుక్ర, రాహు యుతితో పాజిటివ్ పరిణామాలు కలగనున్నాయి. ఏ నిర్ణయమూ తొందరపాటులో తీసుకోవద్దు. ఉద్యోగం మారాలనుకుంటే మంచి సమయం. మంచి అవకాశాలు లభిస్తాయి.

మిధున రాశి

శుక్రుడి గోచారం 11వ పాదంలో ఉండనుంది. ఈ సందర్భంగా శుక్ర, రాహు గ్రహాల యుతితో ప్రతి పనిలో లాభం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పనిచేసే చోట సీనియర్లు, సిబ్బంది సహకారం లభిస్తుంది. ఈ సమయంలో పదోన్నతి అవకాశాలుంటాయి.

మేష రాశి

జ్యోతిష్యం ప్రకారం శుక్రుడి గోచారం మేష రాశి లగ్నపాదంలో ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ రాశి జాతకులపై అంతా అనుకూల ప్రభావముంటుంది. ఈ జాతకం వ్యక్తులపై పాజిటివ్ పరిణామాలుంటాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆర్ధిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో అపారమైన వృద్ధి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link